📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం

Author Icon By Sudheer
Updated: December 8, 2024 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతృత్వం సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత కేసీఆర్ గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దీనిని నిరూపించడంపై దృష్టి సారించాలన్నది కేసీఆర్ సూచన. విద్యారంగంలో ముఖ్యంగా గురుకుల పాఠశాలల పరిస్థితులు, మూసీ నది సుందరీకరణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని పార్టీ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేసీఆర్, ఇది సాంస్కృతిక పరమైన విషయమని, ఇలాంటి మార్పులను సమాజం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ప్రతిష్ఠాత్మక అంశాలను తప్పుగా ఉపయోగిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.

KCR kcr assembly

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.