అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Read Time:  1 min
bunny happy
bunny happy
FONT SIZE
GET APP

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలోని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ వాహన శ్రేణితో అల్లు అర్జున్ హాజరయ్యారు, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించి నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును రద్దు చేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి, నవంబర్ 6 వరకు అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న ఈ కేసుపై మరిన్ని ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో అల్లు అర్జున్‌కు తాత్కాలికంగా ఊరట లభించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.