Bomb threats to RBI office

ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తెలిసిందే. ఈరోజుఉదయం కూడాఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్‌ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధికారిక ఈమెయిల్‌ ఐడీకి రష్యన్‌ భాషలో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముంబయి పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ఢిల్లీలోని ప‌లు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. రెండు నెల‌ల కింద‌ట ఇలానే బెదిరింపులు రావ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. వాటి నుంచి తేరుకోక‌మేందు. తాజాగా మ‌రోసారి శుక్ర‌వారం ఉద‌యం కూడా బెదిరింపు మెయిళ్లు వ‌చ్చాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అయితే.. ఈ దర్యాప్తులో అనుమానాస్పద వ‌స్తువులు కానీ, బాంబులు కానీ గుర్తించలేదు.

ఢిల్లీలో పేరొందిన ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, మోడ్రన్ స్కూళ్ల‌కు తాజాగా బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఈ రోజు(శుక్ర‌వారం) ఉద‌యం య‌థావిధిగా ఆయా పాఠ‌శాల‌లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే పాఠ‌శాల‌ల‌కు బెదిరింపు ఈమెయిళ్లు వ‌చ్చాయి. దీంతో యాజ‌మాన్యాలు హుటాహుటిన ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖకు చేర‌వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేప‌ట్టారు. ఆయా స్కూళ్ల‌లో అణువ‌ణువూ గాలించారు. అయితే.. ఎక్క‌డా అనుమానాస్ప‌ద వ‌స్తువులు ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు.

Related Posts
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: పబ్లిక్ ఆఫీసులు, స్కూళ్లు మూసివేత, బ్యాంకులు అందుబాటులో
elections

మహారాష్ట్రలో ఈరోజు (నవంబర్ 20) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులను తెచ్చే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు తమ ఓటు హక్కును Read more

Crime News :క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త
క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ Read more

అక్షయ్ మూవీ పై ఆగ్రహం వ్యక్తం.స్కై ఫోర్స్
అక్షయ్ మూవీ పై ఆగ్రహం వ్యక్తం

స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య పాత్రపై కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్య సినిమా విడుదలతో సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా Read more

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై లక్షల కోట్ల బెట్టింగ్!
elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ , భారతీయ జనతా పార్టీ మధ్య హోరీహోరీ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని Read more