ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Bomb threat to Air India flight. Emergency landing

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు. సోమవారం ఉదయం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం ప్రయాణికులను అంతా దించివేసి.. ఐసోలేషన్‌ రన్‌వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఇదే విషయపై ఎయిర్‌ ఇండియా సంస్థ స్పదించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విమానాన్ని ఢిల్లీకి మళ్లించామని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Public service modernization › asean eye media. Tips for choosing the perfect secret santa gift. Life und business coaching in wien – tobias judmaier, msc.