Headlines
South Central Railway has announced 26 special trains for Sankranti

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!

కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ అదనంగా మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. కాకినాడ పోర్ట్ నుంచి కొల్లాం వెళ్లే నెంబర్ 07173 ప్రత్యేక రైలు ఈ నెల 11,18,19,25వ తేదీల్లో ప్రతి బుధవారం రాత్రి 11-50 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 5-30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్లే సెంబర్ 07174 ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో ఉదయం 8-40 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 4గంటలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. మార్గమధ్యలో ఈ రైలు కాకినాడటౌన్, సామర్లకోట రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పెట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడసూరు, పాల్పాట్, త్రిసూల్, అలువ, ఎర్నాకులం, ఎట్టుమనూరు, కొట్టాయం, తిరువళ్ల, చెంగనూరు, కన్యాకులం స్టేషన్లలో నిలుస్తాయి.

సికింద్రాబాద్ – కొల్లాం- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కొల్లాం వెళ్లే నెంబర్ 07175 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ఈ నెల 19, 26వ తేదీల్లో గురువారాల్లో రాత్రి 8గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, శనివారం తెల్లవారుజామున 1-30గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో కొల్లాం నుంచి సికింద్రాబాద్ వెళ్లే నెంబర్ 07176 ప్రత్యేక ఈ నెల 21, 28వ తేదీల్లో శనివారాల్లో తెల్లవారుజామున 5గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యలో మౌలాలి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడిమాడి. పెరుగురాళ్ల సత్తలపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు. తిరువణ్ణామలై, విల్లుపురం, వృద్ధానలం, అరియలూరు, శ్రీరంగం, తిరుచిరాపల్లి, డిండిగల్లు, మరులై, విరుదునగర్, తెన సెంగొట్టాయ్ పునలూరు స్టేషన్లలో నిలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *