హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది – బొలిశెట్టి

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ ఈ లడ్డు వ్యవహారం లో ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేయడం తో కూటమి శ్రేణులు సుప్రీం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కదా? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పవన్‌ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలన పై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌పైప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.