हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Black foods: కొలెస్ట్రాల్ తగ్గించడంలో బ్లాక్ ఫుడ్స్ కీలకం

Sharanya
Black foods: కొలెస్ట్రాల్ తగ్గించడంలో బ్లాక్ ఫుడ్స్ కీలకం

LDL(Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తనాళాల్లో పేరుకుపోతూ ఆర్టీరీస్‌ బ్లాకేజీకి కారణమవుతుంది. దీని ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. అలాంటప్పుడు జీవనశైలి మార్పులతో పాటు, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Black Berries Health Benefits 800x400

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయంతోపాటు బీపీ, గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అయితే LDL కొలెస్ట్రాల్‌ను కొన్ని ఆహారాల సహాయంతో సులభంగా నియంత్రించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన నల్ల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే 5 అత్యుత్తమ బ్లాక్ ఫుడ్స్

బ్లాక్ బీన్స్ (Black Beans)

బ్లాక్ బీన్స్‌లో అధికంగా ఉండే డయటరీ ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్, మరియు యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో శోషించకుండా సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున డయాబెటిక్ వ్యక్తులకు అనుకూలం.

నేరేడు పండ్లు (Blackberries / Jamun)

నేరేడు పండ్లలో ఉన్న ఆంథోసైనిన్స్ (Anthocyanins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచ్చమైన వాపులను తగ్గిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఇన్‌సులిన్ రిసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

నల్ల నువ్వులు (Black Sesame Seeds)

నల్ల నువ్వుల్లో ఒమేగా 3 & 6 ఫ్యాటీ ఆసిడ్లు ఉండటంతో గుండెకు మేలు చేస్తాయి. సెసామిన్, సెసామోలిన్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని చట్నీగా లేదా తినే పదార్థాల్లో చేర్చుకోవచ్చు.

black sesame seeds 1

నల్ల ద్రాక్ష (Black Grapes)

నల్ల ద్రాక్షలోని Resveratrol అనే పదార్థం గుండెకు రక్షణగా పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజూ కొంతమేర నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది.

బ్లాక్ రైస్ (Black Rice)

బ్లాక్ రైస్ అనేది సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే అధికంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది సాధారణ వెల్లుల్లితో పోలిస్తే పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అధిక ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉండి, శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బ్లాక్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో మితంగా, సమతుల్యతతో చేర్చుకోవాలి. శారీరక వ్యాయామం, నీటి సేవనం, మరియు వ్యసనాల విరమణ కూడా కొలెస్ట్రాల్ నియంత్రణకు కీలకం.

Read also: Mobile Phone : దిండు దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ప్రమాదకరమా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870