हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

BJP leader : 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ నేత

sumalatha chinthakayala
BJP leader : 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ నేత

BJP leader : బీజేపీ పార్టీకి చెందిన దిలీప్‌ ఘోష్‌ పెళ్లి పీటలెక్కారు. అదే పార్టీకి చెందిన మహిళను మనువాడారు. వీరి వివాహానికి పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా వేదికైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. అయితే ఇప్పటి వరకూ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉన్నారు. అదే పార్టీకి చెందిన 51 ఏళ్ల రింకూ మజుందార్‌ తో దిలీప్‌కు 2021లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో వరు శుక్రవారం కోల్‌కతా లోని దిలీప్‌ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

దిలీప్‌కు ఇది మొదటి వివాహం

వివాహం అనంతరం దిలీప్‌ ఘోష్‌ మీడియాతో మాట్లాడారు. తన తల్లి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఇక దిలీప్‌కు ఇది మొదటి వివాహం కాగా, రింకూ మజుందార్‌కు ఇది రెండో వివాహం. ఆమెకు ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

పలువురు టీఎంసీ నేతలు కూడా అభినందనలు

ఇక, ఈ వివాహ వేడుకకు పలువురు బీజేపీ నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు బొకేలు పంపించి ఓ లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీఎంసీ నేతలు కూడా అభినందనలు తెలియజేశారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఘోష్.. 2015 నుంచి 2021 వరకు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Read Also: వివాహేతర సంబంధం నేరం కాదు – ఢిల్లీ హైకోర్టు తీర్పు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870