Bihar cabinet expansion today

నేడు బీహార్‌ క్యాబినెట్ విస్తరణ..

కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు..

పాట్నా : ఈ రోజు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. క్యాబినెట్‌లోకి కొత్తగా ఆరుగురికి చోటు కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు , ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నితీశ్‌ కుమార్‌ తన క్యాబినెట్‌ను విస్తరించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisements
నేడు బీహార్‌ క్యాబినెట్ విస్తరణ..

దిలీప్‌ జైస్వాల్‌ తన పదవికి రాజీనామా

బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరే ఆ ఆరుగురు ఎవరో అప్పుడే స్పష్టత రానుంది. కాగా ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో రెవెన్యూ మంత్రి దిలీప్‌ జైస్వాల్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ పాలసీకి అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది ఆఖరులో బీహార్‌ అసెంబ్లీ గడువు

దిలీప్‌ రాజీనామాతో ఒక బెర్తు ఖాళీ అవుతుండగా.. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. అంటే బీహార్‌ క్యాబినెట్‌లో ఐదుగురు మంత్రులు పెరగనున్నారు. కాగా, ఈ ఏడాది చివరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జేడీయూలతో కూడిన సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది. అంతకుముందు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్‌ కుమార్‌.. ఆ క్యాబినెట్‌ను రద్దు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చారు. ఈ ఏడాది ఆఖరులో బీహార్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

Related Posts
ఖో-ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం
ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘన విజయం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పురుషుల ఖో-ఖో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.నేపాల్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత Read more

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్‌డౌన్ మొదలైంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి "మినీ వరల్డ్ కప్"గా పిలిచే ఈ Read more

నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren took oath as Jharkhand CM today

రాంచీ: నేడు జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంగా అట్టహాసంగా జరగబోతోంది. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం Read more

రేపటినుంచి 4 పథకాలు ప్రారంభం
indiramma

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న ప్రారంభిస్తున్న పథకాలు. ఒకేసారి 4 Read more

×