Bhatti Vikramarka will be the CM.. Harish Rao

భట్టి విక్రమార్క సీఎం అయితారామే: హరీష్ రావు

హైదరాబాద్‌: ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీష్ రావు వివరించారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు విద్యుత్ శాఖ‌కు చెల్లించామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ భ‌ట్టి విక్ర‌మార్క త‌ప్పుడు లెక్క‌లు చెబుతూ స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏడాది కాలంలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసి కొత్త‌గా ఒక్క ప్రాజెక్టు కూడా క‌ట్ట‌లేదు. మా హ‌యాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా మంచినీటిని అందించాం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తుల క‌ల్ప‌న చేసింది.. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం అప్పులు చేసి క‌మీష‌న్ల కోసం పంచుకుతిన్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. అస‌లు తాము అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా భ‌ట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. త‌మ హ‌యాంలో వ‌డ్లు కొన్నాం.. ఠంచ‌న్‌గా పైస‌లు ఇచ్చాం. భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Related Posts
సంక్రాంతి తర్వాత టీబీజేపీ అధ్యక్షుడి నియామకం
TBJP

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది. పార్టీ హైకమాండ్ సంక్రాంతి పండగ తర్వాత ఈ నియామకాన్ని Read more

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
Central Election Commission

అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల Read more

హైదరాబాద్‌లో అక్రమ మద్యం స్వాధీనం!
హైదరాబాద్‌లో అక్రమ మద్యం స్వాధీనం!

హైదరాబాదులో ఎక్సైజ్ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు లక్ష రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి అక్రమంగా 22 లక్షల విలువైన మద్యం తరలింపు. సమాచారం Read more

లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి
లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉన్నారు. తన హయాంలో ఆయనపై కోట్ల రూపాయల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. Read more