Bandi Sanjay key comments on the budget

Bandi Sanjay: బడ్జెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ని పరిశీలిస్తే.. డొల్ల అని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ను సాధనంగా చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆరోపించారు.

Advertisements
బడ్జెట్ పై బండి సంజయ్

బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన సర్కార్

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్లో గొప్పలు చెప్పిన సర్కార్.. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని బండి సంజయ్ పెదవి విరిచారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదొక అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని ఆయన అన్నారు.

Related Posts
ఫిబ్రవరి 1న భారత బడ్జెట్‌తో అనేక కీలక మార్పులు
ఫిబ్రవరి 1న భారత బడ్జెట్‌తో అనేక కీలక మార్పులు

ఫిబ్రవరి 1న భారత బడ్జెట్‌తో అనేక కీలక మార్పులు జరగనున్నాయి.ప్రతి నెలా 1వ తేదీన కొన్ని నియమాలు మారుతుంటాయి. ఈ మార్పులు సామాన్య ప్రజలపై ముఖ్యమైన ప్రభావం Read more

అరసవల్లిలో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు..
11

అరసవల్లి: రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి Read more

దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు
దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు

శుక్రవారం ముగిసిన ఐదు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశం ద్వారా భారత్ మొత్తం ₹20 లక్షల కోట్ల రూపాయలకిపైగా పెట్టుబడుల హామీలను పొందినట్లు Read more

భారత అంతరిక్ష పరిశోధన ISRO కోసం సిద్ధమైంది
భారత అంతరిక్ష పరిశోధన ISRO కోసం సిద్ధమైంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వందో ప్రయోగం కోసం సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6:23 గంటలకు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×