हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Banana: అరటిపండు తొక్కలో బోలెడన్ని విటమిన్స్

Sharanya
Banana: అరటిపండు తొక్కలో బోలెడన్ని విటమిన్స్

అరటిపండ్లు (Banana) మనకు ప్రతి కాలంలోనూ ఈజీగా దొరికే పండ్లలో ఒకటి. పోషకాహారంతో సమృద్ధిగా ఉండే ఈ పండు రుచి, శక్తి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే, చాలా మందికి ఈ పండులోని అసలు రహస్య భాగం — తొక్క గురించిన అవగాహన లేదు. సాధారణంగా మ‌నం అరటిపండు తిన్న తర్వాత తొక్కను వ్యర్థంగా పారేసేస్తాం. కానీ తాజా అధ్యయనాల ప్రకారం, అరటిపండు తొక్కల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయనీ, వీటిని ఉపయోగించుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తొక్కల్లో విటమిన్

అరటిపండు తొక్కలో విటమిన్ A, C, B6, కాల్షియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలూ ఉన్నాయి. ఇవి శరీరంలోని వైరస్లను, బాక్టీరియాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటీ బలపడేందుకు ఇవి ముఖ్యంగా పని చేస్తాయి.

బనానా పీల్ టీ ఎలా తయారు చేయాలి?

అరటిపండు తొక్క, ఒక గ్లాసు నీరు, కాస్త తేనె ,అర టీస్పూన్ దాల్చిన చెక్క

తయారీ విధానం:

అరటిపండు తొక్కను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో ఈ తొక్క ముక్కల్ని వేయాలి. దాన్ని 5–10 నిమిషాలు మరిగించాలి. చివరగా వడగట్టి, తేనె వేసుకుని వేడిగా తాగాలి.

    ఇమ్యూనిటీ బలపరిచే శక్తి

    అరటిపండు తొక్కల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రోగ నిరోధకంగా మార్చతాయి. సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో రోజూ ఈ టీ తీసుకుంటే ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు.

    హై బీపీ కంట్రోల్

    ఈ టీ స్నాయువుల విశ్రాంతికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం బీపీ నియంత్రణకు సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. హై బీపీ బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

    గుండె ఆరోగ్యం

    గుండె సంబంధిత వ్యాధులు నేడు యువతలోనూ పెరిగిపోతున్నాయి. అరటిపండు తొక్క టీలో ఉండే హైపోలిపిడెమిక్ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. గుండెకు అవసరమైన పోషకాలు అందించడంతో గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.

    మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది

    ఈ టీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ట్రిప్టోఫాన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది సెరటోనిన్ ఉత్పత్తిని పెంచి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి సమస్యలకు సహజ పరిష్కారం లాంటిది.

    జీర్ణ సమస్యలకు చెక్

    తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ టీ తాగడం వల్ల గట్ హెల్త్ మెరుగవుతుంది. అజీర్ణం, గ్యాస్, కడుపులో నిండిన భావం, మలబద్ధకం వంటి సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది.

    బరువు తగ్గడంలో సహకారం

    అరటిపండు తొక్క టీ మెటాబాలిజాన్ని పెంచే గుణం కలిగి ఉంది. ఆకలిని నియంత్రించడంలో, జంక్ ఫుడ్ తినాలన్న భావన తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రోజూ ఈ టీ తీసుకుంటే వంటినే తక్కువగా తీసుకుంటారు, తేలికగా బరువు తగ్గుతారు.

    చర్మానికి కూడా మేలు

    ఈ టీలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలకు సహాయపడుతుంది.

    రోజూ ఉదయం లేదా రాత్రి అరటిపండు తొక్క టీ తీసుకుంటే మొత్తం ఆరోగ్య వ్యవస్థకి మేలు చేస్తుంది. దీనిని రెగ్యులర్ టీ బదులుగా తీసుకుంటే ఒత్తిడి, అలసట, జీర్ణ సమస్యలు, హై బీపీ వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    Read also: High BP: హై బీపీ కి ఉప్పు ఏ కాదు..లైఫ్ స్టైల్ కూడా ముఖ్యమే

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870