हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్

Sudheer
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి ఊరట లభించింది. టీడీపీ కార్యకర్త ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 90 రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీకి ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు బెయిల్ (Bail)మంజూరు చేసింది. గతంలో రెండు సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు, మూడోసారి డిఫెన్స్ వాదనలు వినిపించి బెయిల్ మంజూరు చేసింది. వంశీతో పాటు ఈ కేసులో ఉన్న మరో నలుగురికీ కూడా బెయిల్ లభించింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు

ఈ కేసు నేపథ్యం గమనిస్తే.. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి (Attack on TDP office)కేసుకు సంబంధించి వంశీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దాడి కేసు నుంచి తప్పించుకునే లక్ష్యంతో తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేశాడని కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసి పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో వంశీ దాడికి పాల్పడ్డట్టు స్పష్టమై ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

వంశీ ఆరోగ్యం క్షీణించిందని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వంశీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా, కోర్టు డిఫెన్స్ వాదనలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో వంశీ అనుచరులు ఊపిరి పీల్చుకుంటున్నారు, అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో వంశీకి న్యాయపరంగా పూర్తిగా ఊరట లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Cannes Film Festival : దుస్తులపై కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కొత్త రూల్స్ ..ఎందుకంటే ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870