Bad publicity about my political future.. RS Praveen

నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం : ఆర్ఎస్ ప్రవీణ్

హైదరాబాద్‌: తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్తు కోసం పనిచేయాల్నో క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. మీ లాగా పదవుల కోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి తనకు లేదన్నారు.

Advertisements
నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం

అన్ని పైసలు కూడా తన వద్ద లేవన్నారు. తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీనే సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నానన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ ప్రోత్సాహంతో తెలంగాణ 2.0 ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నానన్నారు.

తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నాను. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రావన్ కు అవకాశం దక్కిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ మోసం చేసిందని, ఇప్పుడు ఆయన ఎమ్ చేస్తాడని పలువురు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతుండటంతో ఆర్ఎస్సీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.

Related Posts
నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ
101 Punjab farmers rally in Delhi today

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర Read more

పంట కొనడం లేదని.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
farmer attempts suicide

రైతుల పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా మార్కెట్ యార్డ్‌లలో కొనుగోలు ప్రక్రియలో జాప్యం అవడం రైతుల మనోస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. Read more

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల
ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస Read more

Vandana Katariya : రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్
Vandana Katariya

భారత మహిళల హాకీ జట్టు స్టార్ ప్లేయర్ వందన కటారియా అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, Read more