101 Punjab farmers rally in Delhi today

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు హ‌ర్యానా ప్ర‌భుత్వం మొబైల్ ఇంట‌ర్నెట్‌, బ‌ల్క్ ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను స‌స్పెండ్ చేసింది. అంబాలాలోని 12 గ్రామాల్లో డిసెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు విధించారు. రైతులు ఢిల్లీకి మార్చింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కిసాన్ మ‌జ్దూర్ మోర్చా నేత స‌ర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు.డిసెంబ‌ర్ 6, 8వ తేదీల్లో చేసిన ప్ర‌య‌త్నాల‌ను హ‌ర్యానా పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.

Advertisements

శాంతియుతంగా చేప‌డుతున్న ధ‌ర్నాల‌కు ప్ర‌భుత్వ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయ‌ని రైతులు ఆరోపించారు. రైతుల‌కు వ్య‌తిరేకంగా ప‌బ్లిక్ సెంటిమెంట్‌ను డెవ‌ల‌ప్ చేసేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. సంఘ‌విద్రోహక శ‌క్తులు త‌మ ర్యాలీలోకి ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు రైతులు పేర్కొన్నారు.

మ‌రో వైపు బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సింఘూ, టిక్రి బోర్డ‌ర్ వ‌ద్ద దాదాపు 700 మంది అమ్మాయిలు అదృశ్య‌మైన‌ట్లు ఆరోపించారు. 2020-2021లో నిర‌స‌న చేప‌ట్టిన స‌మ‌యంలో.. ఆ అమ్మాయిలు క‌నిపించ‌కుండాపోయార‌ని ఎంపీ రామ్‌చంద‌ర్ జంగ్రా తెలిపారు. బాధ్య‌తార‌హిత‌మైన వ్యాఖ్య‌లు చేసిన జంగ్రాను అరెస్టు చేయాల‌ని రైతు సంఘాల నాయ‌కుడు డిమాండ్ చేశారు.

Related Posts
YSRCP: వైసీపీకి ఎదురుదెబ్బ..చొక్కాకుల వెంకటరావు రాజీనామా
Setback for YSRCP.. Chokkakula Venkata Rao resigns

YSRCP: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన Read more

ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు – ఈటల
Etela hydra

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం తీసుకోకుండా పనులు జరుగడం లేదని ఆయన ఆరోపించారు. ఇళ్ల దగ్గరే Read more

ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం
ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం

మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో 184 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ పరాజయం మానసికంగా ఎంతో కష్టంగా ఉందని Read more

‘ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం’ – బాలకృష్ణ
Euphoria Musical balakrishn

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, Read more

Advertisements
×