📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mithuna Rashi phalalu 2026: మిథునరాశి సంవత్సర ఫలము 2026-2027

Author Icon By Rajitha
Updated: March 20, 2026 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదాయం – 08 వ్యయం – 11 రాజ – 01 అవ – 07

మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు “కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛ, కే, కో, హా” అను అక్షరములు తమ పేరునందు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు

2026-2027 సంవత్సర ఫలితములు

మిథునరాశి వారికి ఈ సంవత్సరం లగ్నం, ద్వితీయం,తృతీయంలో గురువు, తృతీయం, ద్వితీయంలో కేతువు, భాగ్యం,అష్టమంలో రాహువు, దశమంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హెూమం జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య కంకణం ధరించండి. ఈ సంవత్సరంలో ఆదాయంలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పెట్టిన పెట్టుబడులు,వ్యాపారం చేసిన ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరిగి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కలిసి వస్తాయి. ఒకే సమయానికి రెండు మూడు అవసరాలు రావటము ఏది ముందు ఏది వెనక తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతారు.

పెద్దల సలహాలు నిపుణులు సలహాలతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి సరైన సమస్యను ప్రాధాన్యత ఇవ్వక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సమస్యలు ఇంతే అని అనుకున్న సమస్యలు సానుకూలంగా మారతాయి. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తెలిసిన వాళ్ళ సహాయంతో మంచి సంబంధం దొరుకుతుంది.

ఆరోగ్య విషయాలలో జాగ్రత్తల అవసరం కొన్ని అలవాట్ల కారణంగా నిద్రాహారాలు భంగం వాటిల్లటం వలన అనారోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడతారు. నడుము నొప్పి కీళ్ళ నొప్పులు అలసటతో బాధపడే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువ ఒత్తిడి గురవుతారు. కొంతమంది ఇచ్చిన సలహాలు సూచనలు మీరు పని చేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. తద్వారా ఎడిషనల్ బెనిఫిట్స్న్ని పొందగలుగుతారు. నాటు వైద్యము ఆకర్షిస్తుంది కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చేసే ప్రయత్నాలలో మాత్రం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దాచాలనుకున్న ధనం దాచాలనుకున్న సమయానికి దాచలేరు చేయి దాటిపోతుంది. మళ్లీ ఎప్పుడు గానీ మళ్ళీ ఆ అవకాశం తిరిగి రాదు.

రుణాలకు సంబంధించిన అంశాలతో కాస్తంత చికాకు పడతారు రుణం తీసుకొని ఎంతవరకు ఇంట్లో వాకు వేధించడము రుణం తీసుకున్న తర్వాత ఇంత రుణం నువ్వు ఎలా తీరుస్తావు నీకు చేతకాదేమో నువ్వు ఇంకాస్త పని చెయ్యి అని గొడ్డుని హింసించినట్టుగా మాటలతో హింసిస్తుంటారు. కొన్ని వనరులను ఏర్పాటు చేయడమే మీ ప్రాథమిక తప్పుగా మీరు భావిస్తారు. శక్తికి మించి పనులను చేయకూడదు రుణాలను తీసుకోకూడదు అన్న గుణపాఠాన్ని నేర్చుకుంటారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది.తోటలు, పండ్లు, పూల తోటలు కలిసి వస్తాయి. అధిక దిగుబడిని పొందగలుగుతారు మంచి ధరకు అమ్ముకోగలుగుతారు. ప్రభుత్వ పరమైన అంశాలలో కూడా మీకు వెసులుబాటు లభిస్తుంది.

అనుకున్న సమయానికి అనుకున్న వాళ్లు మీకు అండగా నిలబడి ప్రయోజనాలను అందిస్తారు. పూల వ్యాపారస్థులకు పండ్లు కూరగాయలు ఆదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు క్రయవిక్రయాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టర్లకు కాలం కలిసి వస్తుంది మీరు చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది. వీటిని ఉపయోగించుకొని మరికొన్ని ప్రాజెక్టులను సంపాదించాలన్న ఆలోచనలు కల నెరవేరుతుంది. ఒకానొక సందర్భంలో కొన్ని పనులను ప్రారంభించడానికి మీరు ఎంతో అవస్థ పడతారు, సతమతమవుతారు. కానీ ప్రారంభం జరిగిన తర్వాత మాత్రం వచ్చిన ఇబ్బందులు ఏవి ఉండవు.

ఏ పనైనా ద్వితీయ ప్రయత్నంలో సజావుగా సాగుతుంది. చిన్న ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొంతమంది మీ పని విధానం చూసి మీ దగ్గర పనితీరు నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. దీని ద్వారా మీకు పరోక్షంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యాదానం అన్నిటికన్నా శ్రేష్టమైనది మనకు వచ్చిన విద్య పంచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాళ్లు గురు ద్రోహం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఎంత విద్య ధార పోయాలో అది తెలుసుకొని మెలగలిగితే అన్ని విధాలా మంచిది.

2026 Yearly Horoscope Telugu Gemini Career Horoscope Telugu Gemini Horoscope Telugu Gemini Marriage Prospects Guru Gocharam 2026 Mithuna Rasi Financial Growth Mithuna Rasi Health Tips Mithuna Rasi Phalalu Mithuna Rasi Remedies Mithuna Rasi Shani Transit Real Estate Business 2026 Subrahmanya Kankanam Subrahmanya Pashupata Homam year horoscope telugu Yearly Predictions Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.