Mesha Rashi Phalalu 2026 : మేషరాశి సంవత్సర ఫలము 2026-2027

Read Time:  1 min
Mesha Rashi
Mesha Rashi
FONT SIZE
GET APP

ఆదాయం – 11 వ్యయం – 05 రాజ – 02 అవ – 04

అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు. “చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మేషరాశికి చెందినవారు.

Mesha Rashi Phalalu 2026 : మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయం, చతుర్థం, పంచమంలో గురువు, పంచమం, చతుర్థంలో కేతువు, లాభం, దశమంలో రాహువు, వ్యయంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మన్యు పాశుపత హెూమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఎంతో కష్టపడి శ్రమిస్తే గాని మీ ఆశించినటువంటి టార్గెట్స్ ఎక్స్ టెన్షన్స్ మీరు రీచ్ కాలేరు. కానీ మీ జీవితం చూసిన వారికి పూలబాటలాగా అనిపిస్తుంది. మీరు అక్కర్లేనంత శ్రమ పడుతున్నారు. ఆందోళన పడుతున్నారు అన్న విధంగా ఉంటుంది.

Mesha Rashi

వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఎన్నో అవరోధాలను దాటుకొని వ్యాపారాన్ని నిలబెట్టుకుంటారు. మంచి ప్రణాళికలతో, స్నేహితుల సహాయంతో మంచి మార్పుని సాధిస్తారు వస్తున్న ఆదాయం సరిపోక కొన్ని వనరుల ఏర్పాటు కోసం కొత్త రుణాలు చేస్తారు. సహోదర సహోదరీ వర్గంతో కొంతకాలం మీకు గిట్టదు. వస్త్రవ్యాపారస్తులకు పెట్టుబడుల రూపంలో ధనం వృధాగా ఖర్చు అవుతుంది అన్న భావన కలిగి ఉంటారు. మీ పేరు లేదా మీ జీవిత భాగస్వామి పేరుమీద కొత్త స్థలము లేదా పొలము కొనాలన్న ఆలోచన ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసుకొంటారు. వాణిజ్యపరమైన అంశాలలో ఆసక్తి కనబరుస్తారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు.

Mesha Rashi

కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించి ఏకతాటిపైన మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలను చేసుకుంటారు తద్వారా శుభ ఫలితాలను మీరు పిల్లలు కలిపి పొందగలుగుతారు. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు మీకు అంతగా ఇమడకపోవచ్చు అని ముందే తెలుసుకున్నప్పటికీ కూడాను తిరస్కరించలేక కొన్నాళ్లు వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నట్లుగా మెతక వైఖరిని కనబరుస్తారు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కాస్తంత చికాకు గురిచేస్తాయి. మీరు అనుకున్న సమయానికి సందర్భానికి ఇల్లు రెడీ కాకపోవడం ఎప్పటికప్పుడు పనులు ఆలస్యంగా జరగటం తీవ్రమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది ఆర్థికపరమైనటువంటి భారము మీరు మోయవలసి వస్తుంది. ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది మంచి ఫలితాలను పొందగలుగుతారు. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి మెడికల్ ఏజెన్సీస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.

రెన్యూవల్స్ సమయంలో కొంతమందితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పునర్ ప్రయత్నాలలో తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది. లేదా మీ వాళ్ళ పేరు మీదకు మార్చి ప్రయత్నించగలిగిన సత్ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యాపార రీత్యా ఆలోచనలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండి వ్యూహాలను వేసుకుంటూ కొత్త కస్టమర్లను క్లయింట్ అను ఆకర్షిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలను సోషల్ మీడియాను ఎంతగానో ఉపయోగించుకొని వ్యాపార విస్తరణ కోసం ఎదుగుదల కోసం ఆదాయం కోసం శ్రమిస్తారు. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో స్త్రీలతోటి విభేదాలు ఏర్పడటం గొడవలు రావడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సరైన సమయాన్ని పట్టుకొని వీళ్ళు ఈ విధంగా మనల్ని బాధిస్తున్నారు. ఇప్పటివరకు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మీ అయిన వాళ్ళ దగ్గర మీరు వాపోతారు. చేపట్టిన పనులు కలిసి వస్తాయి.

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.