Meena Rasi Phalalu 2026: మీనరాశి సంవత్సర ఫలము 2026-2027

Read Time:  1 min
Meena Rasi Phalalu 2026
Meena Rasi Phalalu 2026
FONT SIZE
GET APP

ఆదాయం – 14 వ్యయం – 11 రాజ – 07 అవ – 02

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టిన వారు “ది, దు, శ్యం, ఝా, దా, దే, దో, చా, చి” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.

2026-2027 సంవత్సర ఫలితములు

Meena Rasi Phalalu 2026: మీనరాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో శనీశ్వరుడు, చతుర్థం, పంచమం, షష్టమంలో గురువు, షష్టమం పంచమంలో కేతువు,వ్యయం, లాభంలో రాహువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మన్యు పాశుపత హెూమం జరిపించండి. కాలభైరవ రూపు ధరించండి. ఈ రాశి వారికి వృత్తి రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని కొత్త కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తరచూ బయట వాళ్ల సహాయము పొందుతారు. వృత్తిరీత్యా కార్యాలయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరంటే పడని వారు మీ ఎదుగుదల చూసి ఏడ్చేవారు ఎంతమంది అయితే ఉంటారు మీరు బాగా ఉండాలి, ఎదగాలి, సంతోషంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య కూడా సమానంగా ఉంటుంది.

Meena Rasi Phalalu 2026

ఈ సంవత్సరం ఎక్కువగా నరదిష్టి బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు పరిహారాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండండి. కొత్త పనుల నిమిత్తం సాహసోపేతం అయినటువంటి నిర్ణయాలను తీసుకో కలుగుతారు. దైవ భక్తి మరింతగా పెరుగుతుంది. గుళ్ళు గోపురాలు చూడాలన్న ఆలోచనలు తాపత్రయము మరింతగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆశ్రమాలకు వెళ్లి కొంతకాలం ఉండి గురువుల ఆశీస్సులు పొందాలి దైవ బలం పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనం ఈ విధంగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. నిత్య పూజలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, మంత్ర అనుష్ఠానం, వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో కారణమవుతాయి. కొంతమంది సలహాలు సూచనలు మేరకు మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి.

Meena Rasi Phalalu 2026

ఈ వ్యక్తులను గురువుగా భావించి వారి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తారు. స్నేహితులకు అండగా ఉంటారు వారికి కొంతకాలం ఆశ్రయమిస్తారు వారి బాగు కోసం మీరు శ్రమించి ప్రోగు చేసుకున్న ధనాన్ని వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించడం జరుగుతుంది. తలచిన వెంటనే కొన్ని పనులు కార్యక్రమాలను మొదలు పెట్టాలని ఆరంభ శూరత్వం ఎంతగానో కలిగి ఉంటారు పనులు మధ్య స్థాయికి చేరుకోగానే పలువురు విమర్శించడం కించపరచడం అన్యాయంగా మాట్లాడటం జరుగుతుంది. దీనివల్ల చేపట్టిన పనులు అర్ధాంతరంగా మధ్యలో ఆపివేయాలని ఆదేశిస్తారు. ఈ కారణంగా మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రశంసలకు విమర్శలకు లొంగిపోయి ప్రవర్తించవద్దు. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండగలిగితేనే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వచ్చే మార్పులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. సద్వినియోగం చేసుకోగలుగుతారు.

కుటుంబపరమైనటువంటి ఆలోచనలు ఆవేదన మరింతగా పెరుగుతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలలో ఎంతగానో చిన్న చుప్పించుకుంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మీ పట్ల కనికరం చూపించడం లేదని ఎంతో వేదనకు గురవుతారు. మంచి అవకాశాలు మంచి ఫలితాలు చేయి జారిపోతున్నట్లు ఎంతగానో కృంగిపోతారు. ఇంట్లో వారిని కదిలి చేసేది ఏమీ లేక సాక్షాత్తు మౌనంగా భరిస్తారు. అయిన వాళ్ళతో రాజకీయం చేయలేక ఓటమిని అంగీకరిస్తారు. వ్యాపారంలో అనేక రకాల మార్పులు, సమస్యలు, సవరణలు, ఎప్పటికప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. ఊహించని ఎన్నో ఆటంకాలు అవరోధాలను చాలా కష్టం మీద దాటుకు వస్తారు. వ్యాపారం వెనకడుగు ఉండి మంచి ఆదాయం పొందాలని కోరుకుంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఎంతగానో శ్రమించి మధ్యవర్తుల ద్వారా చేసిన ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి.

మీ తాపత్రయము కోరిక నెరవేరుతుంది. ప్రత్యేకంగా భూ సంబంధమైన వ్యవహారాలలో ఏర్పడిన కలహాలు కోర్టుని ఆశ్రయించిన తీరు విధానం, పెద్దల్ని సంప్రదించి మీరు తీసుకునే నిర్ణయాల వలన మంచి జరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడుల విషయాలలో ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కొంతమంది సహాయాన్ని మీరు ఆశిస్తారు వారి అందదండలు మీకు లభిస్తాయి. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి మీ ఆలోచనలు మీ శక్తిని ధారపోస్తారు శక్తివంచనాలు లేకుండా ఎవరు వచ్చినా రాకపోయినా అన్నీ మీరే అయి, ఎన్నో పనులు చేసి వ్యాపారాన్ని వచ్చే అవకాశాలను చేజారనీయకుండా శ్రమిస్తారు. సంవత్సరం ద్వితీయార్ధం ఆదాయ రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇది మీ మనో ధైర్యానికి కారణమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.