Kumbha Rasi Phalalu 2026: కుంభరాశి వారికి ఈ సంవత్సరం లగ్నం, వ్యయంలో రాహువు, ద్వితీయంలో శనీశ్వరుడు, పంచమం, షష్టమం, సప్తమంలో గురువు, సప్తమం, షష్టమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హెూమం జరిపించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. చేపట్టిన కార్యక్రమాలలో నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎంతగానో శ్రమించి ఆలోచనలు జరిపి వాటిని కార్యరూపంలోకి ప్రవేశపెట్టాలని దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు.
Read Also: Mesha Rashi : మేషరాశి సంవత్సర ఫలము 2026-2027

కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు అపశృతులు చోటు చేసుకున్నప్పటికీ వీటన్నిటిని చూసి భయపడకుండా చేయాలనుకున్న పనిని చేద్దామనుకున్న విధంగానే చేసే విధంగానే మీ ఆలోచనలు ధైర్యం కలిగి ఉంటారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు సంవత్సర ద్వితీయార్ధంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. గురువుల ద్వారా వారి మాటల ద్వారా ఎంతగానో ప్రభావితమై మంచి బాటలో నడవాలి.
అన్ని ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. దూరపు దృష్టితో ఆలోచించుకొని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను ఇప్పటికిప్పుడు వెంటనే అమలుపరచాలన్న విధంగా మీ ప్రయత్నాలు నడవడిక మారే అవకాశం ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రజాదరణ పొందే పాత్రలను పొందగలుగుతారు. పారితోషికం మీరు ఊహించిన స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చు మోడలింగ్‌లో ఉన్నవారికి కలిసొస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంగీతం నాట్యం వేదికల మీద ప్రసంగాలు చెప్పే వారికి సంబంధిత వ్యవహారదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది, రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది.

ప్రజా సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. ప్రజలు ఆకర్షించే విధంగా మీ ప్రయత్నాలు, ప్రణాళికలు ఉంటాయి. అనుకూలమైన వాతావరణం సన్నిహిత బృందం నుంచి సహచర బృందం నుంచి కూడా అందుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు కలిసొస్తుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కించుకోగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వినూత్నమైనటువంటి ఆలోచనలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఘనతను సంపాదిస్తారు. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కొన్ని జంతువులను సాకాలి వాటికి పోషణ అందజేయాలన్న అభీష్టం కలిగి ఉంటారు. సంవత్సర ద్విత్యార్థంలో నెరవేర్చుకోగలుగుతారు.
ప్రేమించి వివాహం చేసుకోవాలని ఆలోచనలు ముందుకి వెనక్కి సాగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది అంగీకారము మరి కొంతమంది ఒప్పుకోకపోవడము కొంతకాలానికి వాళ్లు తిరిగి ఒప్పుకోవడం మరికొందరు ఒప్పుకోకపోవడము ఈ రకమైనటువంటి తలనొప్పితో సతమతమయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు తరచూ చేయవలసి వస్తుంది. మంచి ఫలితాలని మూడు వంతులు పొంద గలుగుతారు. నర్సరీలు, చెట్ల పెంపకము నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు కలిసి వస్తాయి.

వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా కొన్ని సందర్భాలలో నష్టపోయినప్పటికీ పరోక్షంగా ప్రభుత్వ సహాయం లభిస్తుంది. పెద్దలు అండదండలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. పెట్టిన పెట్టుబడులను అందుకో గలుగుతారు. కొత్తగా ఇందులో పరికరాలను తీసుకొని వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవాలన్న ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. విలువైన పరికరాలను వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని మీ స్నేహితులకు సన్నిహితులకు బహుమతిగా అందిస్తారు. అందంగా ఉండాలి. ఆకర్షణీయంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అన్న ఉద్దేశంతో ఎక్సర్సైజులు చేయటము సౌందర్య సాధనాల పట్ల మాకు కనబరుస్తారు. కొన్ని జీవితంలో భాగంగా భావిస్తారు. ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఉన్నవారికి మంచి ఆదాయము మంచి పేరు పొందగలుగుతారు. వృత్తి నిమిత్తం ఆలోచనలు చేసి కొత్త పరికరాలను సమకూర్చుకోగలుగుతారు. ఇది చాలామందికి సాధారణంగానే అనిపించిన మీకు మాత్రం ఒక మైలురాయి దాటిన విధంగా సంతోషాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: