usa

అమెరికాలో మొదలైన అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికా అధ్యక్షుడిగి రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల్లోనే తన ప్రతాపం చూపిస్తున్నారు. అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించనని ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిపడిన వలసదారులను గుర్తించి అరెస్టులు ప్రారంభించారు. ట్రంప్ అధ్యక్ష పీఠ అధిరోహించిన మూడో రోజుల్లోనే ఏకంగా 580 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో టెర్రరిస్ట్‌ ట్రెన్ డి అరగువా గ్యాంగ్‌కు చెందిన నలుగురు సభ్యులు కూడా ఉన్నారు. అలాగే మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన అనేక మంది నేరస్తులు కూడా ఉన్నట్టు కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.

Advertisements

ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ అని ట్రంప్ కార్యవర్గం అభివర్ణించింది. అక్రమ వలసదారులను బంధించి మిలిటరీ విమానంలోకి ఎక్కిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ సోమవారం అమెరికా-మెక్సికో బోర్డర్ దగ్గర అత్యయిక పరిస్థితిని విధించారు. సరిహద్దు దగ్గర హింస, అక్రమ చోటబాటుదారులను నివారించే విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించబోతున్నారు.

Related Posts
త్వరలో భారత్‌కు రానున్న జేడీ వాన్స్ !
JD Vance coming to India soon!

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ Read more

Sunita Williams : సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్
Sunita Williams safely return to Earth

Sunita Williams : సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, Read more

నేడు కెనడా, మెక్సికో, చైనా టారిఫ్‌లను విధించనున్న ట్రంప్
trump

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు అతిపెద్ద US వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో మరియు చైనాపై నేడు సుంకాలను అమలు చేయనున్నారు. వివిధ పరిశ్రమలపై మరింత సుంకాలను Read more

Bahamas: పర్యటక దేశం బహమాస్‌కు వెళ్లవద్దని అమెరికన్లకు ట్రంప్ యంత్రాంగం సూచనలు
పర్యటక దేశం బహమాస్‌కు వెళ్లవద్దని అమెరికన్లకు ట్రంప్ యంత్రాంగం సూచనలు

ప్రముఖ పర్యటక దేశం బహమాస్‌కు వెళ్లే తమ పౌరులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం కీలక సూచనలు చేసింది. బహమాస్‌లో నేరాలు, షార్క్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. Read more

Advertisements
×