Today Gold Rate: ట్రంప్ టారిఫ్ దెబ్బకు భారీగా పెరిగిన పసిడి ధరలు
ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు రోజుకు పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం 1,02,560 కి చేరుకుంది. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక వచ్చే అక్టోబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు రేటు తగ్గింపు అంచనాలు బంగారం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆగస్టు 2 నుంచి 100 గ్రాముల బంగారం ధర 26, 400 పెరగగా..10 గ్రాముల ధర 2,640 పెరిగింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి