हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill
Live Ended

Breaking News: నేటి తాజా వార్తలు 13-08-2025

Digital
07:03 PM (IST) • Aug 13

పాక్ పై భారత్ హెచ్చరికలు నిజమే.. ఆ దేశ ఆర్థిక కష్టాలు..

  • ఐఎంఎఫ్ షరతుల్లో వైఫల్యం — పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీకి విధించిన ఐదు కీలక లక్ష్యాలలో మూడింటిని అందుకోలేకపోయింది
  • 12.3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం చేరుకోలేదు; రిటైలర్లపై పన్ను వేసే ‘తాజిర్ దోస్త్ పథకం’ విఫలం
  • గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 1.2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయడంలో విఫలమయ్యాయి
  • IMF నిధులను పాక్ సైనిక, ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించే ప్రమాదం ఉందని భారత్ ఎప్పటినుంచో హెచ్చరిక
  • ఆర్థిక వ్యవస్థపై పాక్ సైన్యం ప్రభావం, విధానపరమైన లోపాలకు ప్రధాన కారణమని భారత్ వ్యాఖ్య

పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి

06:58 PM (IST) • Aug 13

Red Alert For Telangana:అవసరమైతేనే తప్ప బయటకు రావద్దు..

  • నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ–అతిభారీ వర్షాలకు రెడ్ అలర్ట్
  • హైదరాబాద్, రంగారెడ్డిలో ప్రత్యేక హెచ్చరిక: అతిభారీ వర్ష సూచన
  • కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • అవసరం అయితేనే బయటకు రండి; తక్కువ ప్రాంతాలు, చెరువుల దగ్గర జాగ్రత్త
  • వర్షాల‌తో కుంటలు నిండుతున్నాయి; రైతులు పొలాల్లో పనులు వేగం చేశారు

పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి

03:11 PM (IST) • Aug 13

కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల తవ్వకాలో కీలక మలుపు

  • కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతున్నది..
  • ఆడపిల్లలు, బాలికలపై క్రూర అత్యాచారం.
  • ధర్మస్థల నిందితులు త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబడే అవకాశం..
  • డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో అన్వేషణ కొనసాగింపు..
  • నేత్రావతి నది పరివాహకంలో 13వ నెంబర్ సైట్ వద్ద తవ్వకాలు..
  • భూమిలోపల మృతదేహాల అవశేషాల కోసం గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ వినియోగం.
  • రత్నగిరి బెట్ట సమీపంలో కొత్త మట్టి పోసిన అనుమానంతో SIT నోటీసులు.
  • 38 ఏళ్ల క్రితం విద్యార్థిని హత్యపై పునర్విచారణకు సోదరి విజ్ఞప్తి.
  • 1995–2014 మధ్య వందల మహిళలు, విద్యార్థినుల మృతదేహాల ఖననం ఒప్పుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు.
  • ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తి.

పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి

02:44 PM (IST) • Aug 13

ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ స్టేడియానికి తరలింపు పై ప్రభుత్వానికి నోటీసులు

  • హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి తరలింపు పై హైకోర్టు నోటీసులు జారీ
  • గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై వివాదం తీవ్రం
  • ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు – విచారణకు హైకోర్టు తేదీ నిర్ణయం.
  • ఆసుపత్రి తరలింపు పై ప్రజల అభిప్రాయాలు విభిన్నంగా వ్యక్తం.
  • సెప్టెంబర్ 26కు తదుపరి విచారణ వాయిదా.

పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

12:41 PM (IST) • Aug 13

బాబోయ్ కర్రీపఫ్‌లో పాము పిల్ల

  • నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది.
  • తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్ తిందామనుకున్న ఓ మహిళకు షాక్.
  • కర్రీ పఫ్‌లో నాన్ వెజ్.. అది కూడా పాము పిల్ల రావడం.
  • మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టౌన్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన.
  • అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్‌లో పాము పిల్ల కనుగొన్న శ్రీశైలమ్మ.
  • బేకరీ యజమాని సమాధానం ఇవ్వకుండా షాపు మూసివేసి పరారైన ఘటన.

పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870