ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్ (Technology company Apple), ఓ సీరియస్ లీక్ వ్యవహారంలో లీగల్ యాక్షన్‌కి దిగింది. ఐఓఎస్ 26 (iOS 26) కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి పబ్లిక్‌గా విడుదల చేశారని ఆరోపిస్తూ, యాపిల్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది.యాపిల్ కథనం ప్రకారం, మైకెల్ రామాచియోట్టి అనే వ్యక్తి, యాపిల్ ఉద్యోగి ఇథన్ లిప్నిక్ ఇంట్లో ఉండగా అతని డెవలప్‌మెంట్ ఐఫోన్ చూసి, అందులో ఉన్న ఐఓఎస్ 26 ఫీచర్లను ఫేస్‌టైమ్ ద్వారా ప్రోసర్‌కి చూపించాడు. ఆ ఫుటేజ్ ఆధారంగా, ప్రోసర్ తన యూట్యూబ్ ఛానెల్ (YouTube channel) లో వీడియోలు రూపొందించి, ప్రజల్లోకి ఈ రహస్య సమాచారాన్ని వదిలేశాడు.

బహిర్గతమైన కీలక ఫీచర్లు
ప్రోసర్ తన వీడియోలలో “కెమెరా యాప్ రీడిజైన్”, “మెసేజెస్ అప్‌డేట్స్”, “లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్” వంటి ఐఓఎస్ 26 కొత్త ఫీచర్లను ముందుగానే చూపించేశాడు. ఇది యాపిల్ వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు కంపెనీ చెబుతోంది.
యాపిల్‌కు ఎదురైన వ్యూహపరమైన నష్టం
అక్రమంగా లీక్ అయిన ఈ సమాచారం వల్ల కంపెనీ రహస్య ప్రణాళికలు పబ్లిక్ అయ్యాయి. దాంతో పోటీదారులకు ముందస్తు సమాచారం దక్కిందని యాపిల్ వాదిస్తోంది. దీని ఫలితంగా తమ మార్కెట్ వ్యూహం బలహీనపడిందని, వినియోగదారుల ఆసక్తి కొంత మేర తగ్గిందని ఆరోపిస్తోంది.
కోర్టు లోకంగా కేసు దాఖలు
ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యగా, యాపిల్ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేసింది. రహస్య సమాచారం రక్షణ కోణంలో నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కేసు నడిపిస్తోంది.
Read Also : Supreme Court : నిమిష కు క్షమాభిక్ష దక్కితే తర్వాత బ్లడ్ మనీపై చర్చ