ఇండియాలో కానీ, చైనాలో కానీ… ఐఫోన్‌లు హిట్టే కానీ, ఒక్క ప్రశ్న చాలామందిని ఆలోచనలో పడేస్తోంది – ఇవి అమెరికాలో తయారుకాకపోవడానికి అసలైన కారణాలేంటీ? ఐఫోన్‌ను తయారు చేస్తోన్న ఆపిల్ కంపెనీ అమెరికా ఆధారితదే అయినా, తయారీ మాత్రం ఇతర దేశాల్లో జరగడంలో చాలా వ్యూహాలున్నాయి.
Advertisements

అమెరికాలో తయారీ కాకపోవడానికి కారణాలేమిటి?
- తక్కువ ఖర్చుతో ఎక్కువ కార్మికులు
చైనా, భారతదేశం, వియత్నాం వంటి దేశాల్లో కార్మికులు అందుబాటులో ఉంటారు. పైగా వారి వేతనాలు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. ఐఫోన్ తయారీకి అనేక దశల్లో వేల మంది అవసరం. అమెరికాలో అంత మంది ని నియమించడం ఖర్చుతో కూడిన పని. ఫలితంగా తయారీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. - నైపుణ్య కార్మికుల లోటు
ఐఫోన్‌లను తయారు చేయాలంటే సూక్ష్మ నైపుణ్యాలు అవసరం. చైనాలో ఇవి సులభంగా లభిస్తాయి. అక్కడి కార్మికులు ఏకకాలంలో వేల మందిగా, అత్యంత చక్కగా పనిచేయగలుగుతారు. అమెరికాలో అలాంటి స్పెషలైజ్డ్ లేబర్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. - మంచి సరఫరా వ్యవస్థ
ఐఫోన్‌కి అవసరమైన భాగాలు – కెమెరాలు, మైక్రోచిప్స్, సెన్సార్లు మొదలైనవి – చైనాలోనే ఎక్కువగా తయారవుతాయి. అన్నీ ఒకేచోట లభించటం వల్ల, తయారీ త్వరగా జరుగుతుంది. కానీ అమెరికాలో అలాంటి సప్లయ్ చైన్ విస్తృతంగా లేదు. - ప్రభుత్వ ప్రోత్సాహంలో తేడా
చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిదారులకు రాయితీలు ఇస్తాయి. భూములొస్తే తక్కువ ధరలకు, ట్యాక్స్‌ల్లో సడలింపులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు – ఇవన్నీ మరింత ఉత్పత్తికి దోహదపడతాయి. కానీ అమెరికాలో ఇలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలు తక్కువగా ఉంటాయి. - పర్యావరణ నిబంధనలు గట్టి కావడం
అమెరికాలోని పర్యావరణ నిబంధనలు మరీ కఠినంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు ఏర్పరచాలంటే అనేక అనుమతులు, ఆమోదాలు అవసరం. దీనివల్ల ఖర్చులు పెరగడం అనివార్యం. ఇది కూడా తయారీ అమెరికాలో జరగకపోవడానికి మరో కారణం. ట్రంప్ ఒత్తిడి, యాపిల్ సంకోచం!
ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో తయారీని ప్రోత్సహించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఆపిల్ మీద దేశీయ ఉత్పత్తికి ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, గతంలో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.“అమెరికాలో అంత వేగంగా, అంత నాణ్యతతో, అంత తక్కువలో తయారీ సాధ్యం కాదు.”అంటే క్లియర్ గా చెప్పాలంటే – తక్కువ ఖర్చు, ఎక్కువ వేగం, నైపుణ్యంతో పని చేయగల బృందం – ఇవన్నీ చైనాలో అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం ఆపిల్ కొన్ని విడిభాగాలను అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది. కానీ, పూర్తి స్థాయి ఐఫోన్ అసెంబ్లింగ్‌కి చాలా కాలం పడుతుంది. భారత్‌లోనూ ప్రొడక్షన్ పక్కాగా సాగుతోంది. దీంతో, భవిష్యత్తులో చైనా, ఇండియా, వియత్నాం లాంటి దేశాల్లోనే ఐఫోన్ తయారీ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.