ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ నూతన ప్రణాళికలు, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
టెండర్ల పనులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో, సీఆర్డీఏ (Capital Region Development Authority) ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఆమోదించనున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న వివిధ మౌలిక సదుపాయాల పనులకు ఈ సమావేశంలో తుది ముద్ర వేయనున్నారు. ఈ పనులు పూర్తి అయితే రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంశాలు
ఇందులో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) నాలుగో సమావేశంలో ఆమోదించబడిన కీలక ప్రతిపాదనలను క్యాబినెట్ లో సమీక్షించనున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు, వివిధ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడిదారులను ప్రోత్సహించి, ఉద్యోగావకాశాలను పెంచే అవకాశం ఉంది.
ప్రజలకు కీలక నిర్ణయాలు
క్యాబినెట్ భేటీలో పలు ప్రజాసంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి ప్రణాళికలు, నూతన పాలన విధానాలు మొదలైన విషయాలపై మంత్రి వర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.