Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఎదురు కాల్పులు పలువురు మావోయిస్టుల

మావోయిస్టులకు భారీ నష్టం

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. బీజాపుర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.

Related Posts
నేడు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం
ISRO Set to Launch PSLV C59

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ప్రయోగం సాయంత్రం Read more

తెలంగాణలో వెటర్నరీ సైన్స్‌ అభివృద్ధికిపీపీఏటీతో చేతులు కలిపిన కార్నివెల్
Carnival joined hands with PPAT

పెంపుడు జంతువుల సంరక్షణలో ఆచరణాత్మక దృక్పథాలు, వినూత్నతలతో పశువైద్యులను శక్తివంతం చేయడం.. కుక్కల హీమోప్రొటోజోవా వ్యాధుల నిర్వహణపై నిపుణుల చర్చలు.. భారతదేశంలోనే మొట్టమొదటిదిగా ప్రీమియం లాంబ్ పెట్ Read more

Suicide: జార్ఖండ్ లో..ఘోరం ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది

జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లాలోని మహేశ్‌లిటి గ్రామంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. తండ్రి ముగ్గురు పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం Read more

మందుబాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో పెరుగనున్న మద్యం ధరలు..!
Liquor prices to increase in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ శ్రమిస్తోంది. ఏపీలో మద్యం ధరలను సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం. త్వరలో బీరుకు రూ. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *