hydraa ranganadh

హైడ్రాకు మరో అధికారం..

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం లభించింది.ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మాట్లాడుతూ… నగర పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి ఇకపై హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందన్నారు.

జీహెచ్ఎంసీ చట్టసవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు ఇస్తుందని వెల్లడించారు. కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందన్నారు.

Related Posts
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి
Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా Read more

ఓమ్ని హాస్పిటల్‌లో దారుణం
kukatpally Omni Hospital

ఓమ్ని హాస్పిటల్‌ కూకట్‌పల్లిలోని ఓమ్ని హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరగా, Read more

తెలంగాణ శాసనసభలో మన్మోహన్ సింగ్ స్మారక సమావేశం
తెలంగాణ శాసనసభలో మన్మోహన్ సింగ్ స్మారక సమావేశం

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం డిసెంబర్ 30, 2024, సోమవారం నాడు నిర్వహించనున్నారు. శాసనసభ సచివాలయం ఈ విషయాన్ని శనివారం ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *