📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

YSRCP: నంద్యాలలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన నేత

Author Icon By Saritha
Updated: January 2, 2026 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. (YSRCP) పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నంద్యాల టీడీపీ (TDP) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సమర్థవంతంగా నడిపించిన ప్రదీప్ రెడ్డి, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read also: AP: నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం విమానాశ్రయం 

A setback for YSRCP in Nandyal a leader joins TDP.

ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం తనను ఆకర్షించిందని తెలిపారు.(YSRCP)నంద్యాల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ చేరికతో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ రెడ్డి చేరికతో వైసీపీలోని మరికొందరు అసంతృప్త నేతలు టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh politics Latest News in Telugu Nandyal Politics political defection PV Pradeep Reddy TDP TDP Nandyal Telugu News YSRCP YSRCP Shock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.