📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sunitha: ఇక న్యాయం జరగదా?

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంచలన వ్యాఖ్యలు చేసిన వివేకా కుమార్తె సునీత

పులివెందుల : ఈ ప్రాంత ప్రజలు కొత్త పులివెందులను కోరుకుంటున్నారని పూర్తిగా మార్పు చెందాలని హింస లేని న్యాయం, ధర్మం ఉండేప్రాంతంగా పులివెందుల మారాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించడానికి ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్రెడ్డిలు పులివెందులకు వచ్చారు. వైయస్ కుటుంబ సమాధితోట యందు వైయస్ వివేక సమాధికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణంలోని పాల డెయిరీకి సమీపంలో ఉన్న వివేకానంద రెడ్డి ఇంటి వద్ద డాక్టర్ సునీత (Dr. Sunitha) మీడియాతో మాట్లాడుతూ మేమంతా పాత ఎస్బిఐ బ్యాంక్ సమీపంలో నివసిస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడిని మాతోపాటు ఆడుకుంటూ ఉండేవాడని అలాంటి అవినాష్ రెడ్డి ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదని, అవి నాష్ రెడ్డిని వైయస్ వివేకానందరెడ్డి మంచి నాయకుడిగా మార్చాలనుకున్నాడు అని కానీ వారు అర్థం చేసుకోలేకపోయారన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకొని

నాన్న మృతి చెంది ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు అవుతుందని మృతి చెందిన రోజున నాన్నను చంపినది ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డిలని నమ్మించారని పోలీసులను నాడు బెదిరించి రక్తమంతా శుభ్రం చేసి కట్లు కట్టి మేము వచ్చే సమయానికి బయటకు తెచ్చి పెట్టారన్నారు. ఏనాడు కూడా అవినాష్ రెడ్డి (Avinash Reddy) ఇలా చేయించారన్న అనుమానం నాకు రాలేదన్నారు. అయితే ప్రభుత్వం మారింది విచారణ సిట్ బృందాలు మారుతున్నాయి, కానీ న్యాయం జరగలేదు. పోలీసులను అడ్డుపెట్టుకొని చివరకు సిబిఐని కూడా నిర్బంధించారు. సిబిఐ అరెస్టు చేయడానికి వెళితే ఆసుపత్రికి వెళ్లే ఒక మార్గానంతటిని కూడా పోలీసులచే మూసి వేయించారు. ఎవరు పోలీసులను అడ్డం పెట్టుకున్నారు, ఎవరు పక్షపాతం పోయి ఇచ్చారు, ఎవరికి తొత్తులుగా పనిచేశారు వైకాపా వారికి తెలియదా అని ప్రశ్నించారు.

న్యాయం లభిస్తుంది అని విశ్వసిస్తున్నానన్నారు

నాడు అంతక్రియలకు వెళ్లే సమయంలో పులివెందుల పట్టణం గుండా వెళతారు అనుకుంటే అక్కడ జనాలు ఉండరు చూసేదానికి బాగుండదు షార్ట్ డిస్టెన్స్ లో వెళ్లాం అని చెప్పి నేడు ఘర్షణలో దెబ్బలు తగిలి నందుకే ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు అంటే నాడు వారే చేశారు కాబట్టి షార్ట్ డిస్టెన్స్ అన్నట్టు అర్థమవు తోంద న్నారు. సుప్రీంకోర్టులో అయినా మాకు న్యాయం లభిస్తుంది అని విశ్వసిస్తున్నానన్నారు. పులివెందులలో పాత పులివెందులగా అంటే బెదిరింపులు, హత్య రాజకీయాలు ఉన్నటువంటి ప్రాంతంగా వైకాపా వారు చూడాలని చూస్తున్నారని ప్రజలం దరూ ఆలోచించాలని పులివెందులలో ఒక మార్పు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ ఎన్నికల్లోనైనా ఆ మార్పు వైపు ప్రజలు ఆలోచించాలన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు?

వైఎస్ వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, అలాగే కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కూడా పనిచేశారు. వ్యవసాయశాఖ మంత్రిగా కూడా సేవలందించారు.

ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి?

1999లో కడప నియోజకవర్గం నుండి లోకసభకు ఎన్నికయ్యారు. తర్వాత రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీగా కొనసాగి, కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : 

https://vaartha.com/banakacharla-project-forewater-concept-should-be-used-instead-of-banakacharla/andhra-pradesh/528092/

Andhra Pradesh News AP Politics Avinash Reddy Breaking News Dr Sunitha latest news Political News Pulivendula Politics Telugu News YS Viveka 74th birth anniversary YS Vivekananda Reddy YSR family

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.