📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

YS Sharmila: హైదరాబాదులో వైయస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి: ఎపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పులివెందుల : హైదరాబాద్ లో వైయస్సార్ అభిమానుల కోసం వైయస్సార్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు. మహానేత వైయస్సార్ 76 వ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలోని వైయస్సార్ సమాధి వద్ద ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల (YS Sharmila) మీడియా తో మాట్లాడుతూ వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్య మంత్రిగా రెండు సార్లు పని చేశారనీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకమయ్యారు అని, పరిపాలన, పథకాలతో కోట్ల మందిని అభిమానులుగా చేసుకున్నారు అని ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజం లాంటి పథకాలు మార్క్ పథకాలను ఆయన ప్రవేశ పెట్టారని, మాట తప్పక పోవడం, మడిమ తిప్పక పోవడం ఆయన నైజం అని అందుకే వైయస్సార్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారనీ వైయస్సార్ (YSR) మరణం తరువాత అభిమానులు ఆకాంక్ష కోసం హైదరాబాద్ లో మెమోరియల్ పార్క్ ఏర్పాటు కలగానే మిగిలింది అన్నారు.

YS Sharmila: హైదరాబాదులో వైయస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి: ఎపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

మెమోరియల్ పార్క్

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది,అని అందుకే సోనియాగాంధీ, రాహుల్ లకు, సీఎం రేవంత్ రెడ్డి లకులేఖ ద్వారా హైదరాబాద్ లో మెమోరియల్ ఉండాలని విజ్ఞప్తి చేశా అన్నారు. వైయస్సార్ జయంతులకు, వర్ధంతులకు అభిమానులు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ పార్క్ (Memorial Park) ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ విజయమ్మ, పి సి సి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం సమన్వయకర్త ఇర్ఫాన్, అలాగే జమ్మలమడుగు, కమలాపురం, మదనపల్లి, పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్ షర్మిల పుట్టినతేది ఎప్పుడు?

వైఎస్ షర్మిల 1974 డిసెంబర్ 17న జన్మించారు.

వైఎస్ షర్మిల ఏ పార్టీకి చెందినవారు?

గతంలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 2021లో తెలంగాణ రాష్ట్రంలో “వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ” (YSRTP) ను స్థాపించారు. ప్రస్తుతం ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TTD: భక్తుల అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యత

Breaking News latest news PulivendulaNews Telugu News YSRJayanti YSRTributes YSSharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.