YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మళ్లీ మండిపడ్డారు. కర్నూలు పర్యటన సందర్భంగా ప్రజలకు ఏమీ కొత్తదనం చూపించలేదని, ఆయన పర్యటన “దీపావళి టపాసులా తుస్సుమంది” అంటూ ఎక్స్ (పూర్వ ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాకుండా బీహార్ (Bihar) ఎన్నికల ప్రచార ప్రయోజనాల కోసమే కాషాయ వేషం కట్టారని ఆమె వ్యాఖ్యానించారు. “శ్రీశైలం మల్లన్న సాక్షిగా చవకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు” అంటూ షర్మిల విమర్శించారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “మల్లన్న దేవస్థానం కోసం కేంద్రం ఒక్క రూపాయి కేటాయించిందా? రూ.1,657 కోట్లతో సిద్ధంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ఎక్కడుంది?” అంటూ నిలదీశారు. ఉజ్జయిని, వారణాసి కారిడార్ల అభివృద్ధికి మోదీ చూపుతున్న ఆసక్తి శ్రీశైలం ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు.
Read also: Prashanthi Reddy: జిఎస్టి 2.0తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు
YS Sharmila
ప్రధాని పర్యటనను
అమరావతి (Amaravati) రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ, షర్మిల (sharmila) ప్రధాని వాగ్దానాలను గుర్తు చేశారు. “11 ఏళ్ల క్రితం చెప్పిన మాటలనే మళ్లీ పునరావృతం చేస్తున్నారు. రాష్ట్రానికి అరకొర అప్పులు ఇచ్చి అభివృద్ధి మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయం?” అని నిలదీశారు. రాజధానికి లక్ష కోట్ల అప్పులు తెచ్చినా, నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. షర్మిల వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ చెలరేగింది. ప్రధాని పర్యటనను కాంగ్రెస్ మరోసారి “ప్రచార నాటకం”గా అభివర్ణించింది.
వైఎస్ షర్మిల ఏ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు?
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాకుండా బీహార్ ఎన్నికల ప్రయోజనాల కోసమే వచ్చారని షర్మిల ఆరోపించారు.
మోదీ పర్యటనను షర్మిల ఎలా వ్యాఖ్యానించారు?
“దీపావళి టపాసులా తుస్సుమంది” అని పేర్కొంటూ, ఆయన పర్యటనలో ప్రజలకు ఏమీ కొత్తదనం లేదని ఎద్దేవా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: