రాయలసీమ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ షర్మిల (y.s sharmila) ‘రాయలసీమ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్లకు బలమైన సామాజిక, రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాల్లో రాజకీయాలు ఎక్కువగా రెడ్ల ప్రభావంతోనే నడుస్తున్నాయన్నది అందరూ అంగీకరించే విషయం. ఇదే సామాజిక బలం ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరహాలో రాయలసీమ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read also: Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు
YS Sharmila
ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి పట్టు ఉండగా, షర్మిల కొత్త పార్టీ ప్రారంభిస్తే మొదటి రాజకీయ ప్రభావం ఆయనపైనే పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్న–చెల్లెల్ల మధ్య రాజకీయ పోటీ రాయలసీమ రాజకీయాలను కొత్త మలుపు తిప్పవచ్చని అంచనా వేస్తున్నారు. షర్మిల నిర్ణయం వాస్తవంగా అమలైతే, రాయలసీమలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశముందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: