ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) చేసిన నెహ్రూ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్రo కోసం తన జీవితంలో 12 సంవత్సరాలు జైల్లో గడిపిన జవహర్‌లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకోవడం చరిత్రను తారుమారు చేసే ప్రయత్నమని ఆమె అన్నారు. దేశానికి నిలువెత్తు నాయకుడైన నెహ్రూపై, స్వాతంత్రo ఫలితంగా వచ్చిన అధికారాన్ని దాదాపు 12 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మోదీ విమర్శలు చేయడం విస్మయకరమని వ్యాఖ్యానించారు.
Read also: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు
Sharmila condemns Modi’s comments
“దెయ్యాలు వేదాలు వల్లించినట్లు”
అదే సమయంలో, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ పూర్వ నాయకుల స్వాతంత్ర పోరాటంలో పాత్ర ఏమిటో షర్మిల ప్రశ్నించారు. “అప్పుడు దేశం కోసం ‘వందేమాతరం’ అరిచారు? జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు? 2002 వరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా ఎందుకు ఎగరలేదు?” అంటూ ఆమె నిలదీశారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో విభేదాలు రేపేలా ఉన్నాయని, అవి “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” అనిపిస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
బీజేపీ వివిధ వ్యవస్థలపై తీసుకుంటున్న చర్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నెహ్రూను లక్ష్యంగా చేస్తోందని షర్మిల ఆరోపించారు. ఈ విధానం బ్రిటిష్‌ల ‘విభజించు–పాలించు’ తత్వాన్ని గుర్తు చేస్తోందని, అందుకే మోదీని “అభినవ బ్రిటీషర్”గా పిలవాల్సి వస్తోందని ఆమె అన్నారు. జాతీయ గీతం, వందేమాతరం, స్వాతంత్రపు విలువలను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: