పచ్చకామెర్లు సోకినట్లుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా కూటమి పాలనను ప్రశంసించడం ప్రధాని చేసిన పెద్ద తప్పిదమని ఆమె వ్యాఖ్యానించారు. “పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టే మోదీ గారికి ఏపీ పరిపాలన అద్భుతంగా కనిపిస్తోంది’’ అని ఆమె ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని దృష్టికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
Read also: Vizianagaram: భోజనానికాని దిగితే రూ.67 లక్షలు మాయం
కూటమి పాలన అబద్ధాలతో నిండిపోయిందని షర్మిల విమర్శ
ఒక ప్రకటనలో షర్మిల మాట్లాడుతూ—“రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చినా, తుపాన్లలో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వాస్తవాలు మోదీ గారికి దూరంగానే ఉన్నాయి. వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థుల మరణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ నిలిచిపోవడంతో చికిత్స కోసం తంటాలు పడుతున్న రోగుల పరిస్థితి ఆయనకు పట్టడం లేదు’’ అని అన్నారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
“ప్రజలను మోసం చేస్తున్నారు”
ఏపీ ప్రజల హక్కులను, విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూటమి నాయకులు ప్రధాని ముందు తాకట్టు పెట్టారని షర్మిల దుయ్యబట్టారు. “వాళ్లు చెప్పినట్లే తల ఊపే పరిస్థితిలో ఉన్నందుకే కూటమి పాలన మోదీకి పరిపూర్ణంగా కనిపిస్తోంది. ప్రధాని పదవి ఉంది కాబట్టి అబద్ధాలను నిజాల్లా చూపించాలనుకుంటే ప్రజలు నమ్మరు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
కూటమి నేతృత్వం వహిస్తున్న ప్రభుత్వం అసమర్థంగా పనిచేస్తుందని, ప్రచారమే తప్ప ఆచరణలో ఏ హామీ కూడా అమలు చేయలేదని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అమలు చేయాలని, విభజన హామీలను నెరవేర్చాలని, అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: