📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila: సింగయ్య మృతి దృశ్యాలు భయానకం: షర్మిల

Author Icon By Ramya
Updated: June 23, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి – భయానక దృశ్యాలపై షర్మిల (YS Sharmila) ఆవేదన

Vijayawada: వైసీపీ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వ్యాఖ్యానించారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఈ ఘటన ఉందన్నారు. ఆదివారం పీసీసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఘటనకు జగన్ బాధ్యత వహించాలన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కు కుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.

పర్మిషన్ లేకుండానే జనసమీకరణ – పోలీసులు మౌనంగా ఎందుకు?

పర్మిషన్ కు విరుద్ధంగా జన సమీకరణ జరుగు తుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్రపుచ్చారు ? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు ? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ? ఏం చర్యలు తీసుకుంటున్నారు ? అంటూ ప్రశ్నించారు. కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? అన్నారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ (Jagan) తోపాటు వంద మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని సందేహం వ్యక్తం చేశారు. వారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే.. ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? అంటూ ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్ట్లు చేస్తారన్నారన్నారు. అలాగే తమ పార్టీ చేసే దీక్షలను భగ్నం చేస్తారని.. ఆ క్రమంలో ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు వైఎస్ జగన్ ఏం సమాధానం ఇస్తారన్నారు.

Read also: Tirumala: ‘కల్తీ నెయ్యి’లో బోలేబాబా డెయిరీ కీలకం

#AccountabilityForLives #AndhraPolitics #ConvoyHorror #FailedLeadership #JaganConvoyDeath #JusticeForSingayya #NegligenceOrMurder #OppositionQuestions #PeopleBeforePolitics #PoliticalNegligence #PoliticalPowerVsPeople #PublicSafetyIgnored #RallyTurnedTragedy #SharmilaDemandsAnswers #ShockingVisuals #SingayyaTragedy #WhoIsResponsible #YSRCPControversy #YSSharmilaFires Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.