📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

YS Jagan : 8న అనంత జిల్లాలో వైఎస్‌ జగన్ పర్యటన

Author Icon By sumalatha chinthakayala
Updated: April 5, 2025 • 5:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan : వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైసీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌ బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు.

న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా

తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న కేసీఆర్

Ananta district Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.