📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: YS Jagan- మైక్ ఇస్తే సభకొస్తా

Author Icon By Anusha
Updated: September 20, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే ఎలా?

పార్టీ ఎమ్మెల్యేలతో జగన్

విజయవాడ : ఎంఎల్ఎలందరితో (MLA) పాటు మీకు సమయమిస్తాం అని వాళ్ళు అంటున్నారు. ఒక ఎంఎల్ఎకి ఇచ్చినట్లుగా కొన్ని నిముషాల సమయమే ఇస్తే, ఏం మాట్లాడగలను, ప్రజాసమస్యలను సవివరంగా చెప్పగలరా? అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సభకు రండి, మాట్లాడేందుకు సమయమిస్తా అని స్పీకర్ అంటున్నారు కదా అని తమ పార్టీ ఎంఎల్ఎ ఒకరు అనడంతో జగన్ స్పందించారు.

నువ్వు ఇంకా మనోళ్ళెవరికైనా వస్తే అందరూ వెళ్ళి స్పీకర్ను కలిసి అడగండి. తగిన సమయమిస్తానని హామీ ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకొస్తా’అని పేర్కొన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్ (YS Jagan) ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెప్పేది వేరు… చేసేది వేరు.. ‘సభకు వస్తే మాట్లాడే అవకాశమిస్తామని వాళ్ళు చెబుతారు. కానీ చేసేది వేరే ఉంటుంది.

ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు

రెండు మూడు అంశాలపై మొన్న నేను ప్రెస్మీట్ పెట్టి ప్రజెంటేషన్ (Presentation at a press meet) ఇస్తే గంటపైనే పట్టింది. అలా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు సమయమిస్తారా? ఎంఎలకిచ్చినట్లు సమయమిస్తామంటే వచ్చి మాత్రం ఏం చేయగలం?వాళ్ళు పూర్తి స్థాయిలో సమయమివ్వరు. అందుకే సభకు వెళ్ళకుండా ఇక్కడ 2 ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై మనం కోర్టుకు వెళ్ళాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లకు స్పీకర్ సమాధానమివ్వడం లేదు’ అని జగన్ చెప్పినట్లు సమాచారం.

YS Jagan

అప్పుడు అనర్హత వేటు పడిందా? 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు సభకు రాక పోతే ఆయనపై వేటుపడిందా? లేదు కదా? అయినా మనం ఉభయసభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హాజరయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం.

ఎంఎల్ఏలైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని కొందరు ప్రస్తావించారు

నేను సభకు వచ్చాననేందుకు గవర్నరే సాక్ష్యం’అని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది. పెద్దిరెడ్డి (Peddireddy) తో పాటు ఎంఎల్ఎలు వెళితే వెళ్ళొచ్చు మీరు రాకపోయినా, కనీసం ఎంఎల్ఏలైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని కొందరు ప్రస్తావించారు. ఎంఎల్ఎలను అసెంబ్లీకి వెళ్ళకండడని నేను ఆపలేదు. పెద్దిరెడ్డన్నా నువ్వు పెద్దరికం తీసుకొని ఎంఎల్ఎలను అసెంబ్లీకి తీసుకువెళతావా?

అన్న (పెద్దిరెడ్డి)తో పాటు ఎంఎల్ఎలు సభకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే సభకు వెళ్ళేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. మండలిలో మన బలాన్ని చూపాలి శాసనమండలిలో మనకు మంచి బలం ఉంది. రాజీపడకుండా మన ఎంఎల్సీలందరూ ప్రజల కోసం గట్టిగా పోరాడాలి. రాజకీయంగా ఎదిగేం దుకు మీకు ఇది అవకాశం. ఎవరు ఎలా పని చేస్తున్నారో గమనిస్తుంటాం’ అని ఎంఎల్సీలకు జగన్ చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tirumala-brahmotsavams-begin-from-23rd-of-this-month/andhra-pradesh/550683/

assembly Breaking News comments Former Chief Minister Jagan latest news meeting MLA Public Issues response speaker Telugu News time ysrcp president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.