📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YS Jagan Guntur Visit: అంబటి కుటుంబానికి జగన్ భరోసా

Author Icon By Tejaswini Y
Updated: February 3, 2026 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan Guntur Visit: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా వారిని పరామర్శించిన జగన్, ఇప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు.

Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

YS Jagan Guntur Visit: Jagan assures Ambati’s family

రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరులోని అంబటి నివాసంపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇంటి ఆవరణలోని వాహనాలు ధ్వంసం కావడమే కాకుండా, నివాసానికి నిప్పు పెట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

మరోవైపు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అంబటి కుటుంబానికి అండగా నిలబడాలని జగన్ ఈ పర్యటనను ఖరారు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ambati rambabu Andhra Pradesh politics Chandrababu Naidu Guntur Political Tension TDP Attack YS Jagan Guntur Visit YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.