YS Jagan: జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయండి సిబిఐకి హైకోర్టు ఆదేశాలు. విజయవాడ : వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ జగన్ (ys jagan) అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశించింది. గత నెలలో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే యూరప్ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 14 వరకూ వ్యక్తిగతంగా వచ్చి పర్యటన వివరాలు తెలపాలని జగన్కు సీబీఐ కోర్టు షరతు విధించింది. యూరప్ వెళ్లి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తాను కోర్టుకు వస్తే భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని తెలిపారు.
Read also: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ
YS Jagan: వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న మినహాయింపు
యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక
YS Jagan: అందుకే హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతివ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనపై స్పందించాలని సీబీఐని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక కోర్టులో హాజరు కావాలన్న ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్ గత గురువారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. అక్టోబరు 1 నుంచి 30లోగా 15 రోజులపాటు జగన్ యూరప్ పర్యటన నిమిత్తం సీబీఐ కోర్టు అనుమతి ఇస్తూ వెళ్లే ముందు పర్యటన వివరాలు, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలు సమర్పించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: