📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Jagan: హై కోర్టులో జగన్ కు బిగ్ రిలీఫ్

Author Icon By Sharanya
Updated: June 27, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఇటీవల సంచలనం సృష్టించిన గుంటూరు కారు ప్రమాదం కేసులో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. గుంటూరు సమీపంలో ఓ వృద్ధుడు సింగయ్య ప్రమాదవశాత్తు జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారుకు ఢీకొని మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలను నిందితులుగా పోలీసులు నమోదు చేయడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

YS Jagan

జూన్ 18న జరిగిన ఘటన నేపథ్యం

జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో జగన్ కాన్వాయ్ వెళుతోంది. సింగయ్య అనే వృద్దుడు ప్రమాదవశాత్తు జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల స్పందన – కేసు నమోదు

ఈ ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు.

పిటిషన్లు – హైకోర్టు తీర్పు

కేసును కొట్టివేయాలని కోరుతూ, జగన్‌తోపాటు పై నలుగురు నేతలు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు.

కారును తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు

మరోవైపు పల్నాడు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ ప్రయాణించిన కారును తనిఖీ చేశారు రవాణాశాఖ అధికారులు. జగన్‌ కారు ఢీకొని వృద్ధుడు సింగయ్య మృతి చెందడంతో. ఇప్పటికే కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కారు ఫిట్‌నెస్‌‌ను పరిశీలించారు.

ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకూ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది.

read also: Kadapa: కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ మృతి

PRC: ఆప్కో ఉద్యోగులకు 2022 పిఆర్సీ అమలు

Radhakrishna: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ హజార్

#APPolitics #CarAccidentCase #GunturNews #HighCourtRelief #jagan #YSJagan #YSRCP Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.