పదిహేను నుంచి ఇరవైనాలుగేళ్ల ఏండ్ల వయస్సు కలి గిన ప్రపంచ యువత చదువులు, కొలువులు లేదా నైపుణ్యాభివృద్ధి శిక్షణల్లో తప్పనిసరిగా నిమగ్నం కావాలి. దానికి విరుద్ధంగా చదువులు, కొలువులు
లేదా నైపుణ్య శిక్ష ణలు లేకుండా నేటి యువశక్తి నిర్వీర్యం కావడం ప్రపంచ మానవాళికే శాపంగా మారే ప్రమాదం ఉందని ఐఎల్ద అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ప్రపంచ కార్మిక మార్కెట్లో యువత (youth) భాగస్వామ్యం పెరగ డంతో పాటు రానున్న రెండేళ్ళలో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ అనంతరం 15 – 24 ఏండ్ల యువత (youth)చదువు, కొలువు లేదా శిక్షణల్లో ఏదీ చేయకుండా ఖాళీగా ఉంటూ నేడు పెద్ద ప్రపంచ సమస్యగా మారుతున్నదని విశ్లేషిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనకరమైన పనులకు దూరంగా నిష్క్రియాత్మకంగా తిరుగుతున్న యువతను (youth)“నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రేనింగ్, ఎన్ఎస్ఈఈ టీ (ఉద్యోగం, చదువు లేదా శిక్షణల్లో లేనివారు)” వర్గంగా భావించి అధ్యయనం చేశారు.
నిరుద్యోగ రేటు
2023లో 13 శాతంగా నమోదైన నిరుద్యోగ రేటుతో 64.9 మిలియన్ల యువత ఉండగా 2019లో 13.8 శాతంగా గమనించబడింది. 2024లో నిరుద్యోగ రేటు 12.౮ శాతానికి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అరబ్ స్టేట్స్, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాల నిరుద్యోగ రేటు 2019తో పోల్చితే 2023లో అధికంగా కనిపించడం విచారకరం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గౌరవప్రదమైన ఉద్యోగాల కొరతతో నీట్ విభాగం లో యువత కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తున్నది. 2023లో ప్రతి ఐదుగురిలో ఒక్కరు, అనగా దాదాపు 20
శాతం వరకు ప్రపంచ యువత నీట్ స్థాయిలో ఉన్నట్లు తేలుతు న్నది. మహిళల్లో దాదాపు 33.33 శాతం వరకు, అనగా ప్రతిముగ్గురిలో ఒక్క మహిళ నీట్ దుస్థిలో ఉన్నట్లువిధితం అవుతున్నది. నీట్కె టగిరీలో జింబాబ్వే యువత 32.2 శాతం, భారత్ 23.5 శాతం, నైజీరియా 13.9 శాతం, యూకే 12.8 శాతం, ఫ్రాన్స్ 11.8 శాతం, యూఎస్ 11.2 శాతం, జర్మనీ 7.5శాతం, చైనా 5.9 శాతం యువత ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. గౌరవ ప్రదమైన, అర్హతకు తగిన ఉద్యోగ ఉపాధులు లేక ప్రపంచ యువత అయోమయం, నిరాశానిస్పృహల్లో మగ్గుతున్నారని ఐఎస్ఓ నివేదిక వెల్లడిస్తున్నది. యువకులతో పోల్చితే యువతులు ఉద్యోగ సాధనలో వెనుకబడి ఉండడం (2023లో మాత్రం యువకుల నిరుద్యోగ రేటు 12.9శాతం, యువతులకు 13 శాతం) గమనించారు. ప్రపంచవ్యాప్తంగా నీట్ యువతలో యువతులకు 28.1 శాతం, యువకులకు 13.1శాతం నిరుద్యోగ రేటు నమోదు అయ్యింది. 2024లో ప్రపంచ నిరుద్యోగ రేటు కొంత పెరగ వచ్చనే అంచనాలు మన కలవరానికి కారణం అవుతున్నాయి. అధిగమిస్తూ నేటి ప్రపంచ యువత తమ నైపుణ్యాలు పెంచుకుంటూ, ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఆకర్షణీయ ఉద్యోగాల్లో స్థిరపడడానికి ప్రణాళికలు అమలు పరుచుకోవా లని, ప్రభుత్వాలు కూడా ఈ దిశగా పటిష్ట అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
సమిష్టి కృషిచేయాలి
2023-24 వివరాల ప్రకారం 15 ఏండ్లు దాటిన యువత లేబర్ఫోర్స్ పారేటిసిపేషన్ రేటు 60.1 శాతంగా నమోదు కావడం గమనించాల్సిన అంశం. అధిక ఆదాయం కలిగిన అభివృద్ధి చెందిన దేశాల్లో 17 శాతం యువత తాత్కాలిక ఉద్యోగాల్లో ఉండగా, 76 శాతం యువత శాశ్వత ఉద్యోగాల్లో స్థిరపడ్డట్లు తెలుస్తున్న ది. మధ్య ఆదాయ దేశాల్లో 17శాతం స్వయం ఉపాధుల్లో, 22 శాతం తాత్కాలిక ఉద్యోగాల్లో, 57 శాతం శాశ్వత ఉద్యో గాల్లో పని చేస్తున్నట్లు తేలింది. రానున్న ఈ సంక్షో భాన్ని గుర్తించి నేటి యువతను సన్మార్గంలోకి తీసుకువచ్చి, ప్రపం చ మానవాళి అభివృద్ధికి దోహదపడే విధంగా మలుచుకో వడానికి అన్నివర్గాలు సమిష్టి కృషిచేయాలి. యువతలో నైపుణ్యం పెంపొందించే చదువులు అందుబాటులో ఉండాలి.
-బి. మధుసూదన్ రెడ్డి
నిరుద్యోగులుగా ఉండటానికి కారణాలుఏమిటి?
యువకులు నేటి పరిస్థితుల్లో నిరుద్యోగులుగా ఉండటానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది, తక్కువ నాణ్యత గల ఉద్యోగాలు, ఎక్కువగా లేబర్ మార్కెట్లో అసమానతలతో కార్మికులు ఎక్కువ కాలం పనిచేయాల్సి వస్తోంది, అసురక్షిత పాఠశాల నుండి పనికి బదిలీలకు నిరంతరం గురవుతున్నారు. అదనంగా, మహిళలు తక్కువ ఉపాధి, తక్కువ జీతం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు లేదా తాత్కాలిక ఒప్పందాల క్రింద పని చేసే అవకాశం ఉంది.
నైపుణ్యాల అభివృద్ధి అంటే ఏమిటి ?
నైపుణ్యాల అభివృద్ధి అనేది యువత పని చేయడానికి సాఫీగా మారడానికి ఒక ప్రాథమిక సాధనం. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం 2030 ఎజెండాలో యువతకు నైపుణ్యాలు, ఉద్యోగాలు ప్రముఖంగా ప్రస్తావించబడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: