📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest Telugu News : Corruption : అవినీతి అంతమే యువత నినాదం

Author Icon By Sudha
Updated: December 9, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి ప్రపంచ మానవాళి పలు సవాళ్లు, అసమానతలు, అన్యాయాలు, విషాదాలు, మారణహోమాలు, అపరిమిత అవినీతి చేష్టలు లాంటి సమస్యలతో సతమతం అవుతున్నది. ప్రపంచ యువత అనేక రంగుల కలలు, ఎదగాలనే ఆకాంక్షలతో ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేస్తున్నవేళ అవినీతి (Corruption), లంచగొండితనం లాంటి చెదలు వారిని ఎదుగుదలను ఉద్యోగ ఉపాధులను/విద్యా అవకాశాలను/నైపుణ్య ప్రదర్శనలను/వైద్య ఆరోగ్య సంరక్షణను అడ్డుకోవడం, యువతలో అశాంతికి ఆజ్యం పోయడం జరుగుతున్నది. దీనికి తోడుగా అవినీతి చెదలు విస్తరిస్తూ పర్యావరణ విధ్వంసం, ప్రతికూల వాతావరణ మార్పులకు కారణం అవుతున్నది. ప్రపంచవ్యాప్త దాదాపు 2 బిలియన్ల యువత అవినీతికి (Corruption)వ్యతి రేకంగా ప్రమాణం చేసి, బలీయ శక్తిగా ఎదిగి, నైతికతకు పట్టం కట్టి, అక్రమాల కట్టడికి నడుం బిగిస్తేనే ఉజ్వల భవిత దర్శనమిస్తుందని తెలుసుకోవాలి. ప్రపంచ యువత నైతిక ప్రవర్తన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని డిమాండ్చేస్తూ అవినీతి నిర్మూలనకు పూనుకోవాలని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రపంచమే ఒక యుద్ధ క్షేత్రంగా మారి మానవత్వం మసక బారుతుందని గుర్తుంచుకోవాలి. ఆధునిక పౌర సమాజంలో వేళ్లూనుకు పోయిన అవినీతి చెదలు, లంచాల పీడలను పైకి లించడానికి యువశక్తి మాత్రమే చొరవ చూపాలి.

Read Also: http://Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

Corruption

యునైటెడ్ అగెనిస్ట్ కరప్షన్

యువత లో అవినీతి నిర్మూలన పోరాటాగ్నిని రగల్చడానికి ఐరాస నేతృత్వంలో 2004 నుంచి ప్రతి ఏటా 09 డిసెంబర్ రోజున ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినం (ఇంటర్నేషనల్ ఆంటీకరప్షన్ డే) పాటించుట జరుగు తోంది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేకదినం 2025 ఇతి వృత్తంగా అవినీతి నిర్మూలనతో మానవ గౌరవానికి ప్రోత్సా హం” అనబడే అంశాన్ని తీసుకున్నారు. అవినీతి నిర్మూల నకు యువ యోధుల్లో నైతిక ప్రవర్తన, నీతివంతమైన సమాజ స్థాపన, లంచగొండి గుణాలను పాతరేయడం, నీతి నిజాయితీల ప్రాధాన్యాన్ని పలు వేదికల్లో చర్చించడం, అక్ర మార్కుల భరతం పట్టడం, లంచావతారులను అవినీతి నిరో ధక శాఖ ద్వారా పట్టించడం, నీతిమంతులను సన్మా నించడం, పారదర్శక పాలన ప్రయోజనాలను అవగాహన పర్చ డం, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను ఈ వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది హాష్యాగ్ యునైటెడ్ అగెనిస్ట్ కరప్షన్ అనే నినాదాన్ని తీసుకున్నారు. భారత్లో అవినీతి, లంచగొండిత నం నిత్య నినాదంగా, సర్వవ్యాప్తం అయిం ది. వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు, సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎవ్వరి చరిత్ర చూసినా అవినీతి, అక్రమార్జనల కంపు కొడుతున్నది. లంచం ఇవ్వనిదే చిన్న చీమైనా కుట్టడం లేదు. అవినీతి చేయని అధికారి కనిపిం చడం అసాధ్యంగా తోస్తున్నది. నిత్యం అవినీతి నిరోధక శాఖ పన్నిన వలలో అవినీతి తిమింగలాలు పడుతూనే ఉన్నాయి. అనివెతి నిర్మూలనకు చేసిన చట్టాలకు లంచాల కోరల్లో చిక్కివిలవిలలాడుతున్నాయి.

Corruption

ప్రపంచాభివృద్ధి కి ప్రతిబంధకాలు

మన దేశంలో అవి నీతి నిర్మూలన చట్టం 1988, భారతీయ న్యాయ సంహిత2023, లోక్పాల్, లోకాయుక్త, విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ ఆక్ట్ 2014, సివిసి, సిబిఐ, రాష్ట్ర అవి నీతి నిరోధక శాఖ లాంటివి భారత్లో అమలు అవుతున్నా యి. ప్రపంచ దేశాల్లో అవినీతిని కొలిచే సూచికలను ట్రాన్స్ ఫరెన్సీ ఇంటర్నేషనల్ అధ్యయనం చేసి వివిధ దేశాల జాబితాను తయారు చేస్తు న్నది. 2025లో విడుదలైన గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (ప్రపంచ అవినీతి సూచీ) ప్రకారం 180 దేశాల జబితాలో భారత్కు 96వ స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అవినీతిని అంతం చేయడానికి యువతను ఏకం చేస్తూ శక్తివంతం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం ప్రకటించడం, చట్టాల అమలు, ప్రభుత్వ పని తీరును మెరుగుపరచడం లాంటి చర్యలు నిరంతరం ఉద్యమంగా కొనసాగాలి. ప్రతి ఒక్కరు ‘అవినీతికి నో’ చెప్పాలి. అవినీతి, అక్రమార్జన, అధికార దుర్వినియోగం, మోసాలు, లంచాలు లాంటి దురాలోచనలు ప్రపంచాభివృద్ధి కి ప్రతిబంధకాలని తెలుసుకోవాలి. అవినీతి శృంఖలాలను ఛేదిద్దాం, అక్రమార్జన పరుల భరతంపడదాం, నైతిక ప్రవర్తన ఆయుధాలను సిద్ధం చేద్దాం. మనందరం ఏకమైతే, లంచగొండితనం తోక ముడుస్తుంది. అవినీతి ఆలోచన మానవాళి అభివృద్ధికి గొడ్డలి పెట్టు, దేశభక్తి గొడ్డలితో అవి నీతి విష వృక్షాన్ని నిర్దయగా నరికేద్దాం. అవినీతి అంతమే యువత నినాదం కావాలి.
-ఆచార్య : బుర్ర మధుసూదన్ రెడ్డి

Read hindi news :hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anti-Corruption Breaking News Corruption Good Governance latest news social awareness Telugu News Youth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.