📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : youth : నిశ్శబ్దంగా రాలిపోతున్న యువత

Author Icon By Sudha
Updated: November 22, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకు యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు మేలుకోకపోతే పెనుప్రమాదం. మన భారతదేశానికి ఊహించని ప్రమాద ఘటికలు మున్ముందు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ దేశానికైనా ప్రధాన ఆర్థిక వనరు మానవ వనరు. అందులోనూయువతే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు. దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణం చేతనే తన దేశంలో యువత (youth)సంఖ్యను గణనీయం గా పెంచేందుకు చైనా అధిక సంతానం కోసం అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రతిదేశం యువత సంఖ్య పెంచేందుకు నానాపాట్లు పడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మన దేశంలోని వాతావరణం కనిపిస్తోంది. మన దేశానికి నేడు యువత (youth)సంఖ్య బలంగా ఉంది. ఇది సంతోషంచదగ్గ పరిణామమైతే ఈ వనరు ఆకారణంగా చేజారుతోందన్న ఆందోళనకరమైన పరిస్థితి మరోవైపు కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. భారతదేశం అభివృద్ధిలో దూసు కుపోతున్న ఈ తరుణంలో, ఆ విజయాల వెనుక దాగి ఉన్న ఒక చీకటి సత్యాన్ని మనం తప్పక గుర్తించాలి. అదే భారత యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహ త్యల సంఖ్య, సాంకేతిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి గురించిమనం ప్రతిరోజూ మాట్లాడుతున్నా, మన యువతరం ఎదుర్కొంటు న్న భావోద్వేగ పోరాటాల గురించి మాట్లాడటానికి మాత్రం చాలా అరుదుగా సిద్ధమవుతున్నాం. ఈ నిశ్శబ్దం ఇప్పుడు ప్రాణాలను బలిగొంటోంది. భారత ప్రజా ఆరోగ్యఫౌండేషన్ (పీహెచ్ఎస్ఐ) తాజా నివేదిక అందించిన గణాంకాలు మనల్ని తీవ్రంగా కలవరపెడు తున్నాయి. 15 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయుల్లో ఆత్మ హత్యలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇది కేవలం ఒక గణాంకం కాదు. ఇది మన సామాజిక వ్యవస్థ లోని లోపాలను, కౌన్సిలింగ్ సేవల్లోని అంతరాలను, మాన సిక ఆరోగ్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత లేమిని ఎత్తి చూపుతోంది.

Read Also: JNTU: ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

youth

మన యువతరం అనేక వైపుల నుండి తీవ్ర మైన ఒత్తిడిని ఎదురొ్కంటోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలు, కొద్దిపాటి ఉద్యోగాల కోసం తీవ్ర మైన పోటీ. ఇవన్నీ యువతపై అపారమైన మానసిక భారా న్ని మోపుతున్నాయి. వైఫల్యంపై ఉన్న సామాజిక తీర్పు భయం వారిని మరింత కృంగదీస్తోంది. తమ పిల్లలుడాక్టర్లు లేదా ఇంజనీర్లు కావాలన్న తల్లిదండ్రుల అంచనాలు, వాటిని చేరుకోలేకపోతున్నామన్న భావన యువతలో ఆందోళనను పెంచుతోంది. సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన’ జీవితాలు, విజయాలు చూసి, తమ జీవితాలు అంత గొప్ప గా లేవని భావించడం, నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వంటివి యువతలో తీవ్రనిరాశ, ఒంటరితనాన్ని పెంచి పోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, మన సమాజంలో మాన సిక సమస్యలు అంటే ‘బలహీనత అనే అపోహ ఉంది. ‘మనసు బాగోలేదని చెబితే, సమాజం చిన్నచూపు చూస్తుం దనే భయంతో చాలామంది యువకులు సహాయం అడగ డానికి సంకోచిస్తున్నారు. ఈ ఆలస్యమే ప్రాణాలనుతీస్తోంది. కేవలం అవగాహన ప్రచారాలు సరిపోవు. మనకు ఇప్పుడు అత్యవసరం వ్యవస్థాత్మక మార్పులు, పాఠశాలలు, కళాశా లల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ విజయాలకే కాకుండా, భావోద్వేగ ఎదుగుదలకు, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పడానికి ప్రత్యేకమైన తరగతులు, సెమినార్లు నిర్వహించాలి. ప్రతి విద్యా సంస్థలో అనుభవజ్ఞులైన, సులభంగా అందుబాటులో ఉండే కౌన్సి లర్లు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సివుంది. ఉద్యోగ స్థలాల్లో మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించాలి. ఉద్యోగులకు గోప్యతతో కూడిన కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఉద్యోగు లు విరామం తీసుకోవడానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి ప్రోత్సహించాలి. కౌన్సిలింగ్, థెరపీవంటి సేవలు శారీరక చికిత్సల మాదిరిగానే సాధారణంగా, ఆర్థి కంగా అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకుకూడా మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. విమర్శిం చడం కంటే, సహానుభూతితో వారి మాట వినాలి.
– సయ్యద్ నిసార్ అహ్మద్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Lifestyle mental health SOCIETY Telugu News Youth Youth Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.