నేడు యువత సామాజిక మాధ్యమాల (Social media)బారిన పడి విలువైన భవిష్యత్ని సర్వనాశనం చేసుకుంటూ వున్నారు. కొంత మందికి క్రికెట్ అంటే పిచ్చి. స్నేహితులతోకలిసి ఐపీఎల్లో ప్రతి క్రికెట్ మ్యాచ్ తిలకించిన తర్వాతసెల్ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లోకి ప్రవేశించి పందేలు కట్టడం వంటి ఆరోపణలు వినవస్తూ వున్నాయి. ఆరంభంలో నగదు రావడంతో మరింత ఉత్సాహం చూపిస్తారు. తరువాత పందేల్లో రూ. వేల నగదు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. తొలుత బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేయడం, నగదుకోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకున్న తర్వాత బకాయిలు పెరిగిపోవడంతో చోరీలకు దిగి పోలీసులకు చిక్కిపోతూ వున్నారు. అరచేతిలో ఇమిడే సెల్ఫోన్లో సమస్త ప్రపంచాన్ని వీక్షించే అవకాశం వచ్చింది. తాము చదివే కోర్సులకు సంబంధించి సమాచారాన్ని సేక రించి, జ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటున్నారు. కొందరు మాత్రం సామాజిక మాధ్యమాలు,(Social media) క్రికెట్ బెట్టింగ్లు, ఓటీటీ ల్లో సినిమాల వీక్షణతో కాలక్షేపంచేస్తూ జీవితాన్ని బలిచేసు కుంటున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు సెల్ఫోన్లను ఎక్కువగావాడతారు. తల్లిదండ్రులు కొనిస్తే అప్పటి నుంచి వానిని రోజూ రాత్రి ఫోన్లో ఓటీటీ ప్లాట్ఫాం, యాప్లలో వీడియోలు చూడటం, నిద్రపోకుండా తెల్లవారుజామున రెండు, మూడు గంటల వరకు సెల్ఫోన్ చూస్తూ గడిపేస్తు న్నారు. రాత్రి నిద్రపోకపోవడం వల్ల ఉదయం తరగతి గదిలో మత్తుగా ఉండి అధ్యాపకులు చెప్పే పాఠాలు వారికి అర్థం కావడం లేదు. ఏకాగ్రత దెబ్బతిని చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తు తాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సి రావడం, ఖాళీ సమయం ఎక్కువగా లభించడంతో యువత ఓటీ టీలు, యాప్లు చూడటానికి అలవాటుపడ్డారు. ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లో అశ్లీల సన్నివేశాలు, సంభా షణలు నేరుగా ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి సెన్సార్షిఫ్ లేకపోవడంతో వీటిని చూసి పిల్లలు, యువత పాడైపోతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. హింసాత్మక, లైంగిక కార్యకలాపాల దృశ్యాలు నేరు గా ప్రసారం అవుతుండటంతో యువత తీవ్రంగా ప్రభావి తమై చెడిపోతున్నారు. విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతిని సరిగా చదువుపై దృష్టిసారించలేకపోతున్నారు. తలనొప్పి, కంటి చూపు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.
Read Also : http://Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. కారు యజమాని ఎవరంటే?

నైతికవిలువలు..అడ్డదారులు
యాంత్రిక జీవనంలో సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపో తున్నారు. నైతికవిలువలు, ప్రమాణాలు దిగజారిపోయి అడ్డ దారులు తొక్కుతున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దందాలోకి దిగినట్లు పోలీ సుల విచారణలో తేలుతుంది. ఎనిమిది నుంచి పది గంటలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లో సినిమా లు, వీడియోలు చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పిల్లలు, యువతలో అనారోగ్య సమస్యలు తలె త్తుతున్నాయి. తలనొప్పి, కంటిచూపు సమస్యలు వస్తున్నా యి. మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. మత్తుపదా ర్థాల సేవనానికి అలవాటుపడి బానిసలై నగదు కోసం నేరా లకు దిగడంచాలా ఆందోళనకరం. ఆన్లైన్ బెట్టింగ్లు వచ్చి న తర్వాత పోలీసులు నిఘాపెట్టి పట్టుకోవడం కష్టసాధ్యం గా మారింది. ఐపీఎల్ సమయంలో పెద్దఎత్తున బెట్టింగ్ లలో యువత భారీఎత్తున నగదు పోగొట్టుకున్నారు. రూ. లక్షల అప్పు చేసి తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు. సెల్ఫోన్ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసు కోవచ్చు. విద్యార్థులు, యువత పలురకాల ఆటలు ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పిస్తే రాణిస్తారు. యోగ, ధ్యానం సాధన చేయించడం ద్వారా ఏకాగ్రత సాధిస్తారు. పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టి దారితప్పక ముందే వారు సన్మార్గంలో నడిచేలా చూడాలి. తల్లిదండ్రులు ఎంత తీరిక లేకుండా ఉన్నా పిల్లలకు మాత్రం తగిన సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. మంచి, చెడు గురించి వివరంగా చెప్పాలి. సానుకూల దృక్పథంలో ఆలోచించేలావుండాలి.
– కామిడి సతీష్ రెడ్డి
8సోషల్ మీడియా అంటే ఏమిటి?
2022లో ప్రారంభించబడిన WeAre8, ప్రపంచంలోని ఏకైక స్థిరమైన సోషల్ మీడియా యాప్‌గా తనను తాను ప్రకటించుకుంటుంది. ఇది ప్రకటనలను చూడటానికి మరియు సర్వేలను పూరించడానికి వినియోగదారులకు చెల్లించడం ద్వారా దీనిని సాధిస్తుంది. వినియోగదారులు తాము సంపాదించిన డబ్బును వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడానికి ఎంచుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు తమ PayPal ఖాతాకు డబ్బును చెల్లించవచ్చు.
సోషల్ మీడియా ప్రధాన పాత్ర ఏమిటి?
సోషల్ మీడియా ప్రజలు కనెక్ట్ అవ్వడానికి మరియు నెట్‌వర్క్‌లను నిర్మించడానికి సహాయపడుతుంది . వినియోగదారులు వెబ్ ఆధారిత లేదా మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా సోషల్ మీడియాను యాక్సెస్ చేస్తారు. ఈ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాలు మరియు సంస్థలు వినియోగదారు సృష్టించిన లేదా స్వీయ-క్యూరేటెడ్ కంటెంట్‌ను పంచుకోవడానికి, సహ-సృష్టించడానికి, చర్చించడానికి, పాల్గొనడానికి మరియు సవరించడానికి అనుమతిస్తాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: