📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

APSRTC Tour: రూ.660కే 3 పుణ్యక్షేత్రాలను చూసి రావొచ్చు

Author Icon By Sudheer
Updated: July 23, 2025 • 7:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హనుమంతుని దర్శనాన్ని పవిత్రంగా భావించే భక్తుల కోసం శ్రీ సత్య సాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్లు (APSRTC Tour) ఏర్పాటు చేసింది. శ్రావణ మాసం పురస్కరించుకొని జిల్లాలోని మురిడి, నేమకల్లు, కసాపురం వంటి ప్రాచీన హనుమాన్ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఒక్కరోజులో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ పర్యటనలు రూపొందించబడ్డాయి.

డేట్లు, డిపోలు, టికెట్ ధర వివరాలు

ఈ టూర్లు జులై 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 తేదీలలో మంగళవారం మరియు శనివారాలలో మాత్రమే నడవనున్నాయి. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుగొండ, పుట్టపర్తి డిపోల నుండి బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తి డిపో నుంచి ప్రయాణించే భక్తులకు రానుపోను చార్జీలు కేవలం రూ.660 మాత్రమే. ఈ టికెట్ ధరలో టోల్, ప్యాసింజర్ చెస్‌లు కూడా కలిపి ఉంటాయి.

బుకింగ్ సమాచారం మరియు సంప్రదించవలసిన నెంబర్లు

ఈ పుణ్యక్షేత్ర దర్శన బస్సుల టికెట్లను సమీప బస్ స్టేషన్లలోని ఓపీఆర్‌ఎస్ కౌంటర్లలో లేదా ఏటీపీ ఏజెంట్ల వద్ద పొందవచ్చు. అలాగే APSRTC వెబ్‌సైట్ ద్వారా “Hanuman Darshan” అని టైప్ చేసి డిపో పేరుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంబంధిత డిపో మేనేజర్లను ధర్మవరం (9959225859), హిందూపురం (9959225858), కదిరి (9959225860), మడకశిర/పెనుగొండ (9959229965), పుట్టపర్తి (9959225857) నెంబర్లలో సంప్రదించవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని అధికారుల విజ్ఞప్తి.

Read Also : Indiramma Houses : పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!

APSRTC Tour Google News in Telugu visit 3 shrines for Rs. 660

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.