వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) యువజన విభాగం ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా ‘యువత పోరుబాట’ (Yuvatha Porubata) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్య పాలనను నిరసిస్తూ నిరుద్యోగుల పక్షాన నిలబడేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని యువజన విభాగం నేతలు తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ యువతతో కలిసి ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు.
నిరుద్యోగ భృతి హామీ తక్షణమే అమలు చేయాలి
వైఎస్ఆర్‌సీపీ ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3,000 భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ హామీపై ప్రభుత్వం మౌనంగా ఉండటం, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం యవతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ఆటలాడడం తగదు అని హెచ్చరించారు.
ప్రజా ఉద్యమంగా మారనున్న పోరుబాట
ఈ పోరుబాట కార్యక్రమాన్ని యువతకు న్యాయం కల్పించే పోరాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు యువత సిద్ధంగా ఉందని, ప్రజా వేదికలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ యువజన విభాగం స్పష్టం చేసింది.
Read Also : Kothagudem : కొత్తగూడెంలో పోడు భూముల వివాదం