📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: YCP: ఆ 5గురు ఎమ్మెల్సీలు విచారణకు హాజరు..

Author Icon By Rajitha
Updated: December 2, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం : రాజీనామాలు ఆమోదించాలని కౌన్సిల్ చైర్మన్ కు వినతి శాసన మండల సభ్యులుగా వైకాపాకు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు మా రాజీనామాలు ఆమోదించాల్సిందిగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గతంలోనే రాజీనామా చెసినప్పటికీ ఆమోదించకపోవడంతో ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ కోర్టు ను ఆశ్రయించారు. ఈ విషయంపై న్యాయస్థానం ఎమ్మెల్సీల రాజీనామాలపై విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానం ఉత్తరువుల్లో సూచించింది. ఈ కారణంగా కర్రి పద్మశ్రీ పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్, జయ మంగళ వెంకటరమణ ఐదుగురు ఎమ్మెల్సీలను శాసనమండలి వద్ద రాజీనామాలు గల కారణాలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీలు మారినందున వైకాపా (YSR) ఎమ్మెల్సీలుగా కొనసాగలేమని చైర్మన్ కు వివరించారు.

Read also: Parlement: పార్లమెంటు లో మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా గాంధీ కౌంటర్

Those 5 MLCs appear for questioning

వైకాపాలో గౌరవం లేనందునే

సభ్యుల నుంచి కారణాలు తెలుసుకోకుండా రాజీనామాలు ఆమోదించకపోవడం జరిగిందని తెలిపారు. అందువలన వారి వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకునేందుకు పిలిపించి విచారించామని దీనిపై పరిశీలించి త్వరలో రాజీనామా విషయాలపై స్పందిస్తానని మండల చైర్మన్ వివరించారు. పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీ గా కొనసాగలేమని రాజీనామాలు దయతో ఆమోదించాలని మర్రి రాజశేఖర్ చైర్మన్ కోరినట్లు విలేకరులకు తెలిపారు. సోమవారం చైర్మన్ విచారణ అనంతరం శాసనమండలి బయట లేఖలతో మాట్లాడుతూ గతంలోనే టిడిపిలో చేరినందున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. వైకాపాలో గౌరవం లేనందునే అవమానాలు భరించలేక టిడిపిలో చేరినట్లు వివరించారు. ఆ పార్టీలో వ్యక్తిగతంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి అవమానిస్తున్నారని వివరించారు.

గౌరవం లేని పార్టీలో

పార్టీకి 10సంవత్సరాలు సేవ చేసినప్పటికీ మంత్రి పదవి ఇస్తామని చివరి సంవత్సరం ఎమ్మెల్సీగా ఇచ్చి అవమానించారని తెలిపారు. అందువలన గౌరవం లేని పార్టీలో ఇమడలేక టిడిపిలో గౌరవంతో కొనసాగాలని పార్టీ మారినట్లు అభిప్రాయాన్ని తెలిపారు. అధికార పార్టీలో చేరి ప్రతిపక్ష ఎమ్మెల్సీగా కొనసాగనున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎన్నికల అనంతరం టిడిపికి ప్రజల పట్టకం కట్టడంతో ఎమ్మెల్సీగా ఉన్న నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ అధికారపక్షంలో చేరినట్లు వైకాపా ఎమ్మెల్సీ తెలిపారు. సోమవారం శాసనమండలి చైర్మన్ వద్ద విచారణకు హాజరైన అనంతరం బయట విలేకరులతో మాట్లాడారు. నా వ్యాపారాలు రాజకీయ భవిష్యత్తు స్థానిక ప్రజల ఇబ్బందులు అవసరాలను తీర్చేందుకే పార్టీ మారినట్లు తెలిపారు. అందువలన నా రాజీనామా ఆమోదించాల్సిందిగా చైర్మన్ కు వివరించినట్లు తెలిపారు.ప్రజల్లో విశ్వాసంలేని పార్టీలో కొనసాగలేనందున వైకాపాకురాజీనామా చేసినట్లు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news MLCs resignation TDP Telugu News ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.