YCP Protest in Tirupati: అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైసీపీ శాంతియుత నిర‌స‌న‌

Read Time:  1 min
YCP Protest in Tirupati: అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైసీపీ శాంతియుత నిర‌స‌న‌
FONT SIZE
GET APP

YCP Protest in Tirupati: త‌మ‌పై టీడీపీ రౌడీయిజాన్ని వ్య‌తిరేకిస్తూ తిరుప‌తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శించింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ఆధ్యాత్మిక సంస్థ టీటీడీకి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ప‌రాయి మ‌హిళ‌తో రాస‌లీల‌ల్లో మునిగితేల‌డానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇటీవ‌ల వెలుగు చూశాయి. దీంతో టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసి టీటీడీ ప్ర‌తిష్ట‌ను కాపాడాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Read also: Andhra Pradesh Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు: నేడు పలు జిల్లాల్లో వర్షాలు

YCP Protest in Tirupati: YCP peaceful protest in front of Ambedkar statue

అయితే స‌మాజంలో ప‌రువు పోగొట్టుకున్న‌ప్ప‌టికీ, టీటీడీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతుండ‌డం అనైతిక‌మ‌ని, ఇప్ప‌టికైనా పున‌రాలోచించాల‌ని కోరుతూ బీఆర్ నాయుడు బ‌స చేస్తున్న హోట‌ల్ వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి వెళ్లిన వైసీపీ శ్రేణుల‌పై టీడీపీ గూండాలు భౌతిక‌దాడికి పాల్ప‌డ్డాయి. క‌నీసం మ‌హిళ‌ల‌న్న గౌర‌వం కూడా లేకుండా దాడికి పాల్ప‌డ్డాన్ని వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.

అలాగే బాధితుల‌పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని బ‌నాయించి , జైళ్ల‌కు పంప‌డాన్ని వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వ అధికార దుర్వినియోగాన్ని, త‌మ‌పై వేధింపుల్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిర‌స‌న‌కు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుప‌తిలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్రహం ఎదుట నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్ నేతృత్వంలో శాంతియుత నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కూట‌మి నాయ‌కులు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా భౌతిక‌దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ మండిప‌డ్డారు. తిరుప‌తిలో చెడు సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టార‌ని, భ‌విష్య‌త్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని తీవ్ర హెచ్చ‌రిక చేశారు.

ఇందులో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి , చెవిరెడ్డి హర్షిత్ , ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం , సత్యవేడు ఇంచార్జి రాజేష్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి రెడ్డి , తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.