हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Anantha Babu : హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు

Divya Vani M
Anantha Babu : హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు

మూడు సంవత్సరాల క్రితం జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టు ఎదుట చుక్కెదురైంది. ఈ కేసులో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ అనంతబాబు (Anantha Babu) హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు (High Court)స్టే ఇవ్వడాన్ని తీరస్కరించింది. తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కాకినాడలో దళిత యువకుడు, మాజీ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యంను 2022లో హత్య చేశారు. అనంతరం అనంతబాబు అతడి శరీరాన్ని స్వయంగా కారులో తరలించి వదిలిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అప్పటి ఈస్ట్ గోదావరి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అనంతబాబు నేరాన్ని అంగీకరించారనే విషయాన్ని మీడియా ముందు తెలిపారు.

Anantha Babu : హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు
Anantha Babu : హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు

మధ్యంతర బెయిల్‌పై విడుదల

హత్య అనంతరం అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే బాధిత కుటుంబం మాత్రం అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.సుబ్రహ్మణ్యం కుటుంబం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. న్యాయం జరగాలన్నదే వారి ఆకాంక్ష. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది.

ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు

ఇటీవల మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు, ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం 90 రోజుల్లో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించి, ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు చట్టబద్ధమని పేర్కొంది. దీంతో అనంతబాబుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్టైంది.

Read Also : Abhishek Nair : టీమిండియా మాజీ కోచ్‌నే నమ్ముకున్న వారియర్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870