📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Land : వైసీపీ నేత జవాన్ భూమి కబ్జా చేసాడు – లోకేష్

Author Icon By Sudheer
Updated: June 2, 2025 • 8:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఓ జవాన్ (Jawan), తన కుటుంబానికి చెందిన భూమిని వైసీపీ నేతలు (YCP Leaders ) కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ మంత్రి నారా లోకేష్‌(Lokesh)కు ఫిర్యాదు చేశారు. బీఎస్‌ఎఫ్ జవాన్ నరసింహమూర్తి ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య, మామకిచెందిన భూమిని వైసీపీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బలవంతంగా ఆక్రమించాడని నరసింహమూర్తి ఆరోపించారు. కోర్టు తీర్పు, సంబంధిత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేత దాడులు

జవాన్ తెలిపారు ప్రకారం… సర్వే నంబర్లు 366-6, 366-7, 366-8, 366-9 లోని భూమిని సాగు చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, వైసీపీ నేత దాడులకు దిగాడని తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ అనేకసార్లు తిరిగినా స్పందన లేదని, తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దేశం కోసం రేయింబవళ్లు సరిహద్దుల్లో కాపలాకాస్తున్న తాను, తన కుటుంబానికి ఈ దురవస్థ కలుగుతుందంటే బాధ కలుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో, నారా లోకేష్‌ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు.

జవాన్ సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ హామీ

ఇటీవల కడప మహానాడు సందర్భంగా కూడా ఈ విషయాన్ని జవాన్ లైవ్‌గా తెరపైకి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్, వ్యక్తిగతంగా జవాన్ కుటుంబ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో దేశం కోసం కృషి చేస్తున్న సైనికుల కుటుంబాలను కాపాడలేని పరిస్థితి ప్రజాస్వామ్యానికి అపచారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో, జవాన్లకు చెందిన భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Kamal Hassan : కమల్ హాసన్ కు మద్దతు : రామ్ గోపాల్ వర్మ

Google News in Telugu jawan land Nara Lokesh YCP leader Jawan has seized land ycp leader kabja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.